Andhra Pradesh: ఏపీ వ్యాప్తంగా సోమవారం నాడు అన్ని జిల్లాల కేంద్రాల్లో టీచర్స్ ఫెడరేషన్ నిరసనలు చేపట్టనుంది. ఈ విషయాన్ని ఏపీ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి నాగరాజు వెల్లడిచారు. ఉపాధ్యాయులు, ఉద్యోగులు, ఫించనర్లను ప్రభుత్వం ఇబ్బంది పెడుతోందని.. దాచుకున్న డబ్బును కూడా తీసుకుంటోందని ఆయన ఆరోపించారు. ప్రభుత్వానికి ఎన్నిసార్లు వినతిపత్రాలు ఇచ్చినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నిరసనలు చేయకుండా పోలీసులు భయాందోళనకు గురిచేస్తున్నారని టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి నాగరాజు విమర్శలు చేశారు.…
APTF: ప్రతి ఏడాది సెప్టెంబర్ 5వ తేదీన సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు ఏపీలో ఈనెల 5న జరగాల్సిన ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను బహిష్కరిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ (ఏపీటీఎఫ్) ప్రకటించింది. ఏపీలో ఉపాధ్యాయులను అవమానించేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఏపీటీఎఫ్ ఆరోపించింది. అందుకే ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను బహిష్కరిస్తున్నట్లు వివరించింది. ఇందులో భాగంగా ఉత్తమ ఉపాధ్యాయులకు ప్రభుత్వం నుంచి అందే సన్మానాలను కూడా తిరస్కరించాలని నిర్ణయించినట్లు తెలిపింది. Read…
ఏపీలో పీఆర్సీ అంశం ఉద్యోగుల మధ్య చిచ్చుపెట్టింది. డిమాండ్లు పరిష్కారం కాకుండానే ఉద్యమాన్ని ముగించడం పట్ల కొన్ని ఉద్యోగ సంఘాలు తీవ్రంగా తప్పుబడుతున్నాయి. ఈ క్రమంలో ఉద్యోగుల జేఏసీలో చీలిక వచ్చింది. ప్రభుత్వ ప్రతిపాదనలకు జేఏసీ స్టీరింగ్ కమిటీ అంగీకరించడంపై ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నాయి. మంత్రుల కమిటీతో పీఆర్సీ సాధన సమితి ఏం చర్చించిందో అర్థం కావడం లేదని.. అశుతోష్ మిశ్రా రిపోర్టు చూపించలేదని, నూతన పీఆర్సీ జీవోలు రద్దు చేయలేదని ఏపీటీఎఫ్ నేతలు ఆరోపిస్తున్నారు. Read…