రైతు భరోసాతో వ్యవసాయం సాఫీగా సాగుతోందని ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి మేకతోటి సుచరిత అన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రతిపక్ష నేత చంద్రబాబు పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. వ్యవసాయం దండగ అన్న వ్యక్తులే ఇప్పుడు రైతుల పరిస్థితిపై మొసలి కన్నీరు కారుస్తున్నారన్నారు.
చంద్రబాబు, కరువు కవలలు అన్న నానుడి రాష్ట్రంలో ఉందని మంత్రి మేకతోటి సుచరిత అన్నారు. ఇంకా ఆమె మాట్లాడుతూ వైసీపీ అధికారంలోకి వచ్చాక వరుసగా మూడు సీజన్లలలో వర్షాలు వచ్చాయన్నారు. రైతు పండించిన పంటకు మంచి ధర వస్తుంది …రైతులు అంటే గిట్టని వాళ్ళు వ్యవసాయం అంటే పడని వాళ్ళు రైతు పేరుతో ఉద్యమాలు చేయడం ఎంటో ప్రజలే తేలుస్తారని మంత్రి విమర్శించారు.