AP Budget Session 2023: ఆంధ్రప్రదేశ్‌లో నాలుగేళ్లుగా పారదర్శక పాలన సాగిస్తున్నాం.. డీబీటీ ద్వారా నేరుగా లబ్ధిదారులకే నగదు అందిస్తున్నాం.. అర్హులందరికీ సంక్షేమ పథకాలు చేరవేస్తున్నామని తెలిపారు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్.. బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన సందర్భంగా ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తూ.. నవరత్నాలతో సంక్షేమ పాలన అందిస్తున్నామని వెల్లడించారు.. పేద పిల్లలకు ఇంగ్లీష్ మీడియం ద్వారా విద్య అందిస్తున్నాం.. రాష్ట్రంలోని యువత ప్రపంచస్థాయిలో పోటీపడేలా విద్యారంగంలో మార్పులు తెచ్చామన్నారు.. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ప్రోత్సాహకర ధోరణిలో ఉంది. 2022-23 ముందస్తు అంచనాలు ప్రస్తుత ధరలలో 16.22 శాతం సమగ్ర వృద్ధిని సూచిస్తున్నాయన్నారు.. ఆర్థిక వ్యవస్థ యొక్క అన్ని రంగాలు అంటే వ్యవసాయం, అనుబంధ రంగాలు, పరిశ్రమలు మరియు సేవల రంగం చెప్పుకోదగిన వృద్ధి తీరును చూపుతున్నాయి. అధిక సమగ్రాభివృద్ధిని నమోదు చేయడానికి ఆర్థిక వ్యవస్థకు పరిశ్రమ మరియు సేవల రంగాలు తోడ్పడ్డాడయన్నారు.. ప్రస్తుత ధరలలో ఆంధ్రప్రదేశ్ తలసరి ఆదాయం 2021-22లో రూ.1,92,517/- నుండి 14.02 శాతం ప్రోత్సాహక వృద్ధిరేటుతో రూ. 2,19,518/- లకు చేరినట్టు వెల్లడించారు.
Read Also: MK Stalin: శ్రీలంక చెర నుంచి భారతీయ జాలర్లను విడిపించాలి.. ప్రధాని మోదీకి స్టాలిన్ లేఖ
మా ప్రభుత్వంచే సమర్ధ విధాన రూపకల్పన మరియు అమలు వల్ల 2021-22లో ఏటేటా 11.43 శాతం జీఎస్‌డీపీ వృద్ధిరేటును సాధించింది.. ఇది అన్ని రాష్ట్రాల కంటే అత్యధికమని పేర్కొన్నారు గవర్నర్ . ఈ ప్రభుత్వం 2020-21 నుండి మన బడి – నాడు నేడు కార్యక్రమాన్ని అమలు చేస్తున్నది. రూ.3,669 కోట్ల ఆర్థిక వ్యయంతో మొదటి దశలో ఆధునీకరణ కోసం 15,717 పాఠశాలల్లో చేపట్టామన్నారు. రెండవ దశలో రూ.8,000 కోట్ల వ్యయాన్ని 22,344 పాఠశాలలకు వర్తింపు చేశామని.. మూడేళ్ల కాలంలో మొత్తం రూ.16.01.67 కోట్ల అంచనా వ్యయంతో ఈ కార్యక్రమం కింద 57,189 పాఠశాలల్లో, 3,280 ఇతర విద్యా సంస్థలలో మౌలిక సదుపాయాలను కల్పన లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. జగనన్న అమ్మఒడి’ కార్యక్రమం ద్వారా 84 లక్షల మంది పిల్లలను పాఠశాలలకు పంపడానికి 44.49 లక్షల మంది తల్లులకు జగన్ ప్రభుత్వం మద్దతు ఇచ్చిందన్న ఆయన.. వైసీపీ ప్రభుత్వం ఇప్పటి వరకు ఈ కార్యక్రమం ద్వారా రూ.19,617.60 కోట్ల మొత్తాన్ని ఖర్చు చేసిందని వెల్లడించారు. సంవత్సరానికి ప్రతి తల్లికి ఇస్తున్న రూ.15,000 మొత్తంలో నుండి రూ.1,000ని మరుగుదొడ్ల నిర్వహణ కోసం కేటాయిస్తున్నాం.. మరో వెయ్యి రూపాయలతో పాఠశాల నిర్వహణ నిధికి కేటాయించటం జరుగుతోందన్నారు.
Read Also: Attack on Hijras: హిజ్రాలపై పెళ్లి బృందం గొడ్డళ్లతో దాడి.. కాళ్లు మొక్కినా కనికరించలేదు..
వైసీపీ ప్రభుత్వం రూ.690 కోట్ల విలువగల 5.20 లక్షల ట్యాబ్‌లను పంపిణీ చేసిందని వెల్లడించారా గవర్నర్.. ఈ ట్యాబ్‌లలో “బైజూస్” కంటెంట్ ప్రీలోడ్ చేయబడ్డాయి. వాటిని 8వ తరగతికి చెందిన 4.60 లక్షల మంది విద్యార్థులకు, 60,000 మంది ఉపాధ్యాయులకు ఉచితంగా పంపిణీ చేశామన్నారు. మరోవైపు.. ఆరోగ్య శ్రీ క్రింద వర్తింపచేసిన ప్రొసీజర్లను 2022, అక్టోబరు నుండి 2,446 నుండి 3,255 కు పెంచడం జరిగింది. ప్రస్తుతం ఈ పథకం వర్తింపును 716 సూపర్ స్పెషాలిటీ ప్రొసీజర్ల కోసం హైదరాబాద్, చెన్నై, బెంగుళూరు వంటి రాష్ట్ర వెలుపలి నగరాలకు కూడా విస్తరించటం అయ్యిందన్నారు. నవ రత్నాలు పేదలందరికీ ఇళ్ళు కార్యక్రమం క్రింద ఇళ్ళ స్థలాలను, గృహాలను సమకూర్చడం ద్వారా 2024 నాటికి అర్హులైన ప్రజలందరికీ ప్రభుత్వం శాశ్వత గృహాలను అందించడానికి కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.. ఈ కార్యక్రమం క్రింద మహిళా లబ్ధిదారుల పేరిట 30.65 లక్షల ఇళ్ల స్థలాల పట్టాలను పంపిణీ చేశామని.. ప్రతి ఇంటి స్థలం విలువ రూ.5 – 10 లక్షల మేరకు ఉంది. ఇప్పటి వరకు లబ్ధిదారులకు 21.25 లక్షల గృహాలను మంజూరు చేసినట్టు తన ప్రసంగలో చెప్పుకొచ్చారు గవర్నర్ అబ్దుల్ నజీర్.