Attack on Hijras: హిజ్రాలపై పెళ్లి బృందం గొడ్డళ్లతో దాడి.. కాళ్లు మొక్కినా కనికరించలేదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Attack on Hijras: హిజ్రాలపై ఫంక్షన్ హాల్ సిబ్బంది దాడి చేసి చితకబాదిన సంఘటన కరీంనగరంలో జిల్లా తిమ్మాపూర్ మండలం అల్గునూర్ గ్రామంలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడంతో సంచలనంగా మారింది.
Read also: Boy Falls into Borewell: విషాదం.. 200 అడుగుల బోరుబావిలో పడి ఐదేళ్ల బాలుడు మృతి
Also Read
- Haribabu Murder Case: యూట్యూబర్ వైష్ణవి భర్త హత్య కేసులో కీలక పరిణామం.. మరో నలుగురి పాత్రపై దర్యాప్తు..!
- Hyderabad: హైదరాబాద్‌లో దారుణం.. హిట్ అండ్ రన్లో మూడేళ్ల బాలుడు మృతి
- Heavy Rain Alert: వినాయక నిమజ్జనం వేళ తెలంగాణకు చల్లని కబురు.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
- Etela Rajender : తెలంగాణకు బీసీ సీఎం.. ఈటల కీలక వ్యాఖ్యలు
అల్గునూర్ ఉన్నతి ఫంక్షన్ హాల్ లో పోరండ్ల గ్రామానికి చెందిన వారి వివాహ వేడుక జరుగుతోంది. విషయం తెలుసుకున్న కొందరు కరీంనగర్‌కు చెందిన హిజ్రాలు ఫంక్షన్ హాల్‌కు వెళ్లారు. పెళ్లికొడుకు నుంచి కొంత డబ్బును కానుకగా ఇవ్వాలని కోరారు. అయితే పెళ్లి కొడుకు బంధువులు డబ్బులు ఇచ్చేందుకు నిరాకరించారు. అయినా హిజ్రాలు చాలా దూరం నుంచి వచ్చామని కాస్తైన డబ్బులు ఇవ్వాలని వేడుకున్నారు. దీంతో అక్కడున్న ఫంక్షన్ హాల్ మేనేజర్, మరికొందరు సిబ్బంది హిజ్రాలపై దాడికి దిగారు. మాట మాట పెరిగి అదికాస్త ఇనుప రాడ్లు, గొడ్డళ్లతో దాడి చేసేంతగా వెళ్లింది. విచక్షణారహితంగా హిజ్రాలపై దాడి చేయడంతో తీవ్రగాయాలయ్యాయి. అక్కడ జరుగుతున్న ఘటనను ఎల్‌ఎండీ పోలీసులకు సమాచారం అందడంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడిన హిజ్రాలను సమీప ఆసుపత్రికి తరలించారు. అయితే.. సోమవారం హిజ్రాల ఫిర్యాదు మేరకు ఫంక్షన్ హాల్ మేనేజర్, సిబ్బందిపై కేసు నమోదు చేసినట్లు ఎల్‌ఎండీ ఎస్సై ప్రమోద్‌రెడ్డి తెలిపారు. హిజ్రాలపై దాడి చేయడం నేరమని, డబ్బులు అడిగితే లేదని చెప్పాలిగాని ఇలా దాడిచేయడం నేరమన్నారు. దీనిపై దర్యాప్తు చేసి దాడిచేసిన వారిపై కఠినంగా శిక్షిస్తామని తెలిపారు.
TSPSC Paper Leak: TSPSC పరీక్ష రద్దుపై ఉత్కంఠ.. మధ్యాహ్నం రానున్న క్లారిటీ
తాజావార్తలు
-
Tata Aeris: టాటా నుంచి సరికొత్త సెడాన్.. టిగోర్ స్థానంలో ‘ఏరిస్’.. ఫీచర్లు అదుర్స్
-
Itlu Arjuna Teaser: మాటల్లేవ్… మాట్లాడుకోవడాలు లేవ్… డైలాగ్స్ లేకుండానే అనీష్ నటన అదుర్స్..
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
Raptee.HV T30: రాప్టీ.హెచ్‌వి T30 ఎలక్ట్రిక్ బైక్.. 150KM రియల్ రేంజ్, కారు ఛార్జర్‌తో ఛార్జింగ్!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
ట్రెండింగ్
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!