ఆంధ్రప్రదేశ్ కేబినెట్ పలు కీలక అంశాలపై ఫోకస్ పెట్టింది.. రేపు ఉదయం 11 గంటలకు సచివాలయంలో సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగనుంది.. ఇక, ఈ సమావేశంలో చర్చించనున్న అంశాలను పరిశీలిస్తే.. ఆన్‌లైన్‌లో సినిమా టికెట్లు అమ్మకాలకు వీలు కల్పించేలా ఆర్డినెన్సుకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది.. సినిమాటోగ్రఫీ చట్ట సవరణ చేసే అర్డినెన్సుకు అమోదం తెలపనుంది.. ఇక, వచ్చే నెలలో అసెంబ్లీ శీతాకాల సమావేశాలు నిర్వహించాలని భావిస్తున్న ఏపీ ప్రభుత్వం.. అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై కూడా చర్చించే అవకాశం ఉంది..
Read Also: వైఎస్ వివేకా కేసు.. ఛార్జ్‌షీట్ దాఖలు చేసిన సీబీఐ
మరోవైపు, టీటీడీలో ప్రత్యేక ఆహ్వానితుల నియామకంపై కూడా కేబినెట్ చర్చించనుంది.. ప్రత్యేక ఆహ్వానితుల కోసం చట్ట సవరణకు ఆమోదం తెలిపే అవకాశం ఉండగా..దేవాదాయ స్థలాలు, దుకాణాల లీజుల అంశంపై దేవాదాయశాఖ చట్టసవరణ చేసే అంశంపై దృష్టిసారించనుంది.. దేవాదాయ శాఖలో విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ వింగ్ ఏర్పాటు పై మంత్రులతో చర్చించనున్నారు సీఎం వైఎస్ జగన్.. ఇక, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల అభివృద్ధి కార్యకలాపాల పర్యవేక్షణ కోసం ఓ శాఖ ఏర్పాటు చేసే విషయమై చర్చించనున్నారు.. వివిధ సంస్థలకు భూ కేటాయింపుల విషయమై కేబినెట్‌లో చర్చ జరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది.