వారం రోజుల తర్వాత కృష్ణపట్నం లోని తన నివాసం వద్దకు చేరుకున్నారు ఆనందయ్య. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కృష్ణపట్నంలో పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేసారు. కుటుంబ సభ్యులు తప్ప ఇంకెవరినీ అనుమతించం లేదు పోలీసులు.. వారం రోజులపాటు కృష్ణపట్నం పోర్టులోని సివిఆర్ ఫౌండేషన్ లో ఉన్నారు ఆనందయ్య. అయితే పెద్ద ఎత్తున ఆనందయ్య ఇంటి వద్దకు చేరుకున్నారు గ్రామస్తులు. అయితే నేను ఎక్కడికి వెళ్లడం లేదు ఇక్కడే ఉంటాను. ప్రభుత్వం అనుమతించిన వెంటనే ఇక్కడి నుంచి నేను అన్ని జిల్లాలకు రాష్ట్రాలకు పంపిణీ చేస్తాను అన్నారు ఆనందయ్య. అలాగే తనకు సహకరించిన గ్రామస్తులకు ధన్యవాదాలు తెలిపారు.