కారుకు మీడియా సంస్థ పేరు స్టిక్కర్ పెట్టుకొని గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ముగ్గురు నిందితులను అనకాపల్లి జిల్లా నర్సీపట్నం పోలీసులు అరెస్టు చేశారు. జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా వివరాలు వెల్లడించారు. నర్సీపట్నం శివారులో వాహన తనిఖీలు చేస్తుండగా.. కారులో అక్రమంగా తరలిస్తున్న 205 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.
Rachakonda CP: రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు నేతృత్వంలో డ్రగ్ మాఫియాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. సైనిక్‌పురిలో గ్యాస్ వ్యాపారం ముసుగులో హెరాయిన్ డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఓ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. గ్యాస్ స్టవ్ విడిభాగాల ముసుగులో ఈ ముఠా హెరాయిన్‌ను సరఫరా చేస్తుండగా.. కన్స్యూమర్లకు ర్యాపిడో, ఓలా, ఉబేర్ వంటి రవాణా సేవల ద్వారా డ్రగ్స్ అందజేస్తున్నారని విచారణలో వెల్లడైందని కమిషనర్ సుధీర్ బాబు తెలిపారు. ఈ ముఠా చాలా కాలంగా…
Drugs Seized: చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా డ్రగ్స్, గంజాయి, బంగారాన్ని పట్టుకున్నారు ఎయిర్ పోర్ట్ అధికారులు. ఇందులో భాగంగా 14.2 కోట్ల విలువ చేసే కోకైన్, 76 లక్షల విలువ చేసే విదేశీ గంజాయి, 1.75 కోట్ల విలువ చేసే 1.78 కేజీల బంగారం సీజ్ చేసారు కస్టమ్స్ అధికారులు. అధికారులు పట్టుకున్న కొకైన్ ను క్యాప్సూల్స్ లో నింపి పొట్టలో దాచింది లేడి కిలాడి. అదికూడా ఏకంగా 76 క్యాప్సూల్స్ మింగింది కెన్యా జాతీయురాలు.…
Ganja Seized : మెదక్ జిల్లా మొగుడంపల్లి మండలం మాడిగిలోని ఆర్‌టీఏ చెక్‌పోస్ట్ వద్ద 800 క్వింటాళ్ల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముంబైకి భారీ ఎత్తున గంజాయి తరలిస్తుండగా, పూణె , గోవా రాష్ట్రాల డిఆర్‌ఐ స్పెషల్ ఫోర్స్ అధికారులు లారీని వెంబడించి పట్టుకున్నారు. తమను పోలీసులు వెంబడిస్తున్నట్లు గమనించిన లారీ డ్రైవర్ చాకచక్యంగా చెక్‌పోస్ట్ వద్ద లారీ ఆపి, కాగితాలు చూపించిన తర్వాత అక్కడి నుంచి పరారయ్యాడు. లారీ వద్ద ఉన్న డిఆర్‌ఐ అధికారులు…
తెలంగాణ డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (TGDCA) వారు తాజాగా మార్కెట్లో విక్రయమవుతున్న "MENSET Forte Syrup" అనే ఆయుర్వేద మందును గుర్తించి, దానిపై తప్పుదోవపెట్టే ఆరోగ్య వాదనలు ఉండటం వల్ల చర్యలు తీసుకున్నారు. ఈ మందు పై ఉన్న లేబల్స్, మెన్స్ట్రుయల్ ప్రాసెస్ సంబంధిత వ్యాధుల్ని, అందులోనూ అసమంజసమైన మెన్స్ట్రుయేషన్, మెనోపాజల్ సిండ్రోమ్, అమినోరియా వంటి మేన్స్ట్రల్ డిసార్డర్లను నయం చేస్తుందని పేర్కొంటూ, డ్రగ్స్ & మ్యాజిక్ రెమిడీస్ (ఆబ్జెక్షనబుల్ అడ్వర్టైజ్‌మెంట్) యాక్ట్, 1954 ని ఉల్లంఘించడాన్ని…
ఏఓబీ ఆంధ్రా ఒరిస్సా బార్డర్ నుంచి గంజాయి, బెంగూళూరు, గోవా, విదేశాల నుంచి దిగుమతి అవుతున్న డ్రగ్స్‌ను ఎక్సైజ్, ఎన్ ఫోర్స్‌మెంట్ పోలీసులు ఎంతో శ్రమకు ఓర్చి పట్టుకున్నారు. 703 కేసుల్లో పట్టుబ డిన 7951 కేజీల గంజాయిని, డ్రగ్స్‌ను కాల్చేశారు. దహనం చేసిన గంజాయి, డ్రగ్స్ విలువ రూ.11,61,90,294 ఉంటుంది.
హైదరాబాద్ మహానగరంలో డ్రగ్స్, గంజాయిని నిర్మూలించేందుకు పోలీసు శాఖ చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలోనే నగరంలో ప్రధాన కూడళ్లు, చెక్‌పోస్టులు, పబ్బులు, క్లబ్బుల్లో విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు. నిత్యం నగరంలోని ఏదో ఒక చోట డ్రగ్స్, గంజాయి పట్టుబడుతూనే ఉన్నాయి. తాజాగా రాచకొండ కమిషనరేట్ పరిధిలో గురువారం భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి.
హైదరాబాద్ లో మరో సారి భారీగా డ్రగ్స్ ని అధికారులు పట్టుకున్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ అడ్డగా కొనసాగుతున్న డ్రగ్స్ దందాకి అధికారులు ఫుల్ స్టాప్ పెట్టారు. లావోస్ నుంచి హైదరాబాద్ కి వచ్చిన నలుగురు మహిళల నుంచి 5 కిలోలకు పైగా కోకాన్ ను స్వాధీనం చేసుకున్నారు.
డార్క్‌నెట్, క్రిప్టోకరెన్సీని ఉపయోగించిన పాన్-ఇండియా డ్రగ్ నెట్‌వర్క్‌ను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) ఛేదించింది. 15 వేల ఎల్‌ఎస్‌డీ బ్లాట్స్‌ను ఎన్సీబీ సీజ్ చేసింది. ఈ వ్యవహరంలో ఆరుగురిని ఎన్సీబీ అరెస్ట్ చేసింది.