Ambati Rambabu: జనసేన పార్టీని పెట్టింది చంద్రబాబును సీఎం చేయడానికా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో పొత్తులపై రాజకీయాలు వేడెక్కాయి. జనసేన, టీడీపీ పొత్తు అంశంపై తీవ్ర చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. చంద్రబాబు ఎన్నికలంటే భయపడుతున్నారని.. కానీ ఎన్నికలంటే భయపడాల్సిన అవసరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదన్నారు. గడిచిన మూడేళ్లలో ఎన్నో సంక్షేమ పథకాలను తమ ప్రభుత్వం అమలు చేసిందని అంబటి రాంబాబు గుర్తు చేశారు. టీడీపీ హయాంలో టీడీపీ చేసిందేమీ లేదు కాబట్టే తనతో పొత్తు పెట్టుకోవాలని అందరి కాళ్ల, వేళ్ల మీద చంద్రబాబు పడుతున్నారని ఆరోపించారు.
సీఎం జగన్‌ను పోలీసులు లేకుండా బయటకు రావాలని చంద్రబాబు అంటున్నారని.. చంద్రబాబు తన జడ్ ప్లస్ సెక్యూరిటీ తీసేసి బయటకు వస్తే గతంలో ఎన్నో హామీలు ఇచ్చిన మోసం చేసినందుకు ఆయన్ను మహిళలు చెప్పుతో కొట్టడానికి సిద్ధంగా ఉన్నారని మంత్రి అంబటి రాంబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగన్ సింగిల్‌గా బయటకు వస్తే ఆయనకు వచ్చే ప్రజాదరణ చూసి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ హడలిపోయి చచ్చిపోతారన్నారు. జనసేన పార్టీని పెట్టింది చంద్రబాబును సీఎం చేయడానికా అని జనసేన కార్యకర్తలందరూ పవన్ కళ్యాణ్‌ను ప్రశ్నించాలని అంబటి రాంబాబు సూచించారు.
Also Read
- Ambati Rambabu: అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు.. పోలీసు నోటీసులపై అంబటి ఆగ్రహం..
- LV Prasad Hospital: అమరావతిలో ఎల్.వి.ప్రసాద్ కంటి ఆసుపత్రి.. 12 ఎకరాల స్థలంలో నిర్మాణం..
- Agni veer Rally: సైనిక కల కల్లైంది.. విశాఖ అగ్నివీర్ ర్యాలీలో విషాద ఛాయలు..
- Sai Krishna Missing Case: సాయి కృష్ణ కేసులో కీలక మలుపు.. హైకోర్టులో తల్లి సంచలన వాదనలు
జనసేన కార్యకర్తలు ఇంట్లో డబ్బులు ఖర్చు పెట్టి పార్టీ కోసం పని చేస్తుంటే పవన్ కళ్యాణ్ మాత్రం చంద్రబాబును సీఎం చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఎద్దేవా చేశారు. 2024లో కూడా ఈ రాష్ట్రానికి సీఎం జగనే అవుతారని మంత్రి అంబటి రాంబాబు జోస్యం చెప్పారు. కరోనాతో ప్రభుత్వానికి ఆదాయాలు పడిపోయినా సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత సీఎం జగన్‌దే అన్నారు.
Pawan Kalyan: నేను సింగిల్‌గా రావాలని చెప్పడానికి వైసీపీ వాళ్లెవరు?
తాజావార్తలు
-
Explainers: బాబోయ్.. ఇండియన్స్ వద్దు..!
-
US: విమానంలో మహిళ రచ్చరచ్చ.. నగ్నంగా తిరుగుతూ అసభ్య ప్రవర్తన
-
Ambati Rambabu: అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు.. పోలీసు నోటీసులపై అంబటి ఆగ్రహం..
-
CM Revanth Reddy : రేవంత్‌తో ప్రిన్స్ రహీమ్ ఆగా ఖాన్ భేటీ.. గ్లోబల్ సమ్మిట్‌కు ఆహ్వానం
-
UPI Charges: యూపీఐ చెల్లింపులపై కేంద్రం కీలక నిర్ణయం.. అక్టోబర్ 15 నుంచి అమల్లోకి కొత్త నిబంధనలు..
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్‌ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?