Ambati Rambabu: పోలవరం ఆలస్యానికి చంద్రబాబే కారణం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై నిప్పులు చెరిగారు ఏపీ ఇరిగేషన్ మంత్రి అంబటి రాంబాబు. చంద్రబాబు హయాంలో ప్రాధాన్యత ఉన్న కీలక పనులేవీ చేయలేదు. టీడీపీ పాలనలో కాంట్రాక్టర్లకు బాగా మిగిలే పనులు మాత్రమే చేశారు. వైసీపీ ప్రభుత్వం కీలకమైన పనులే టేకప్ చేశాం. రెండు సార్లు కోవిడ్ వచ్చినా పనులు ఆగకుండా చిత్తశుద్ధితో పని చేశాం అన్నారు అంబటి.
ఈ జలయజ్ఞాన్ని వైఎస్సార్ ప్రారంభించారు.. ఆగే ప్రసక్తే లేదు. మేము అధికారంలోకి వచ్చాక ప్రాధాన్యత క్రమంలో 6 ప్రాజెక్టులను ఎంచుకున్నాం. తక్కువ ఖర్చుతో వాటిని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఉపద్రవం కోవిడ్ వచ్చింది.. తేదీలు కొంచెం అటు ఇటు అవ్వొచ్చు. 14 ఏళ్ళు సీఎంగా ఉన్నప్పటికీ.. చంద్రబాబు తన చరిత్రలో ఒక్క ప్రాజెక్టుకైనా రిబ్బన్ కట్ చేశారా..? అని అంబటి ప్రశ్నించారు.
Also Read
- AP Rain Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో వర్షాలు.. ఏ జిల్లాల్లో అంటే..
- Talliki Vandanam Scheme: గుడ్న్యూస్.. రూ.10,049 కోట్లు విడుదల.. 'తల్లికి వందనం'కి సొమ్ము ఖాతాల్లో పడేది ఎప్పుడంటే..?
- AP Local Body Elections: ఏపీలో ఎన్నికల సందడి.. స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధం..
- Jagan 2.0 Super App: జగన్ 2.0 సూపర్ యాప్ ఆవిష్కరణ.. పోలీసు కేసుల నుంచి పార్టీ సమావేశాల వరకు అన్నీ..
పోలవరం ఆలస్యం కావడానికీ కారణం చంద్రబాబు. టీడీపీ చేసిన పాపం వల్ల డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయింది. ప్రపంచంలో డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోవడం ఎక్కడా లేదు. దీనివల్ల రూ. 400 కోట్లు వృధా అయ్యింది.. మళ్లీ కట్టాలంటే అదనపు ఖర్చు. దాని నుంచి నీటిని తోడి మళ్లీ కట్టాలంటే రూ. 2 వేల కోట్లు కావాలి.. ఈ పాపం టీడీపీది కాదా..? అన్నారు. చంద్రబాబు చేసిన తప్పుల వల్ల నిపుణుల కమిటీ వచ్చి రీ డిజైన్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు.
గత రెండేళ్లలో అందరికీ సాగు నీరు అందజేశాం. నీరు చెట్టు కింద ఎన్ని నిధులు కాజేశారో అందరికీ తెలుసు. నెల్లూరు సంగం బ్యారేజీ పూర్తి చేసి జులైలో రైతులకు అందజేసేలా ప్రయత్నం చేస్తున్నాం. అవుకు రెండో టన్నెల్లో చంద్రబాబు సగం పనులు వదిలేసారు. అవుకు టన్నెలును మా ప్రభుత్వం చిత్తశుద్ధితో పూర్తి చేస్తున్నాం. పోలవరం నుంచి శాస్త్రీయంగా రెండు దశల్లో నీరు ఇస్తారు. ముందు కనీస నిల్వ సామర్ధ్యం నుంచి నీళ్ళు ఇస్తారు.. ఆ తర్వాత పెంచుకుంటూ వెళ్తారు. ఎవరు అపరిచితుడో అందరికీ తెలుసు. స్పీల్ వే నష్టంపై చంద్రబాబు చర్చకు సిద్ధమా..? అని సవాల్ విసిరారు.
దాని వల్ల ఆర్థికంగా నష్టం.. రెండు సీజన్లు నష్టపోయాయి. చంద్రబాబు ఎంత బలహీనుడో వాళ్ళ అబ్బాయి ఎంత బలహీనుడో అందరికీ తెలుసు. వాళ్ళ బలహీనతని కప్పిపుచుకోడానికి జగన్ బలహీనుడు అంటున్నారు. రాముడు కొడుకునంటాడు.. రాముడు కొడుకు మూర్కుడు ఎలా అవుతాడు..? అన్నారు మంత్రి అంబటి రాంబాబు.
Read Also: Deputy CM Mutyala Naidu: పెన్షన్ల పంపిణీపై విషప్రచారం
తాజావార్తలు
-
Bank Loan: ఎలాంటి పూచీ కత్తు లేకుండా రూ.20 లక్షల లోన్ .. ప్రాసెస్ ఇదే..
-
MG Motors: MG నుంచి కొత్త ADAPT టెక్నాలజీ.. EVలు, హైబ్రిడ్ కార్ల తయారీలో సంచలనం..
-
Kejriwal: సోనం వాంగ్చుక్కు కేజ్రీవాల్ మద్దతు.. యువత డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్
-
IND vs ENG 2nd ODI: సిరీస్ చేజిక్కించుకోవాలంటే బౌలర్ల చేతుల్లోనే.. ఇంగ్లాండ్ లక్ష్యం ఎంతంటే..
-
The Odyssey: ‘ది ఒడిస్సీ’ ప్రీ రివ్యూ ..
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!