ఏపీలో అన్ని పథకాలు సక్రమంగా అమలవుతున్నా విపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని మండిపడ్డారు డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు. ఒకటో తేదీన సూర్యోదయానికి ముందే పెన్షన్ల పంపిణీ జరుగుతుంటే దురుద్దేశపూర్వకంగా దుష్ప్రచారం ప్రారంభించారని ఆయన మండిపడ్డారు. పంచాయితీ నిధులను అవసరం మేరకు ప్రభుత్వం వినియోగించుకోవడం కొత్తేమీ కాదన్నారు.
టీడీపీ హయాంలో జరగలేదని చంద్రబాబు, యనమల రామకృష్ణుడు చెప్పగలరా…? గ్రామీణ ప్రాంతాల్లో సచివాలయాలు, హెల్త్ సెంటర్స్ అభివృద్ధి, పూర్తి స్థాయి సిబ్బంది నియామకం ప్రాధాన్యతగా పెంచుకున్నాం. నీరు చెట్టు మట్టి తవ్వకాల్లో వేల కోట్ల రూపాయలు ఎక్కడికిపోయాయని చంద్రబాబుని ఆయన ప్రశ్నించారు. అప్పు చేసైనా పేదవాడికి సంక్షేమం అందిస్తున్నాం. టీడీపీ ప్రభుత్వం దిగిపోయే నాటికి రాష్ట్రంలో అప్పులు లేవా? అన్నారు ముత్యాలనాయుడు.
ఎన్నికల ముందు ఇచ్చిన హామీకి తగ్గట్టుగానే పెన్షన్లు పెంపు జరుగుతోంది. టీడీపీ హయాంలో పెన్షన్ల కోసం నాలుగు వందల కోట్లు కేటాయిస్తే జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం రూ.1570కోట్లు ఇస్తోందన్నారు. పాలన విషయంలో సీఎంను విమర్శించే అర్హత హక్కు ప్రతి పక్షాలకు లేదన్నారు. రేషన్ కోసం పెన్షన్ కోసం అరుగుల మీద కూర్చొనే స్థితి నుంచి ఇంటి వద్దకే అందించే వ్యవస్థ సీఎం జగన్మోహన్ రెడ్డి కల్పించారన్నారు.
Read Also:Anil vs Kakani: మంత్రి అడ్డాలో మాజీ మంత్రి హల్ చల్