రాజకీయాలకు గుడ్‌బై చెప్పాలని నిర్ణయం తీసుకున్న వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత విజయసాయిరెడ్డి.. ఈ రోజు భారత ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్‌ను కలిసి రాజీనామా లేఖను సమర్పించారు... ఇక, ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.. నా రాజీనామాను ఉపరాష్ట్రపతి ఆమోదించారు.. పూర్తిగా వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేశానన్న ఆయన.. వైసీపీ అధినేత వైఎస జగన్‌తో అన్నీ మాట్లాడాకే రాజీనామాపై నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు..
రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు విజయసాయిరెడ్డి.. భారత ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌కడ్‌తో సమావేశమైన ఆయన.. తన రాజీనామా లేఖను అందజేశారు..