IPS Transfers in AP: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలనపై ఫోకస్ పెట్టారు.. ఇప్పటికే సీనియర్ ఐఏఎస్ అధికారులను.. జిల్లాల కలెక్టర్లను బదిలీ చేస్తూ వచ్చిన ప్రభుత్వం.. ఇప్పుడు ఎస్పీల బదిలీలపై సుదీర్ఘ కసరత్తు చేసింది.. హోంశాఖ మంత్రి, డీజీపీతో సమావేశమైన సీఎం చంద్రబాబు.. ఏ జిల్లాకు ఎవరు ఎస్పీ అయితే, బాగుంటుందనే దానిపై సమాలోచనలు చేశారు.. చివరకు పెద్ద ఎత్తున ఎస్పీలను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.. 14 జిల్లాలకు కొత్త ఎస్పీలను నియమించింది ప్రభుత్వం.. 7 జిల్లాలకు ఎస్పీలుగా కొత్త అధికారులు రాగా.. మరో 7 జిల్లాలకు ఇతర జిల్లాల నుంచి బదిలీ చేశారు.. ఇక, 12 జిల్లాల్లో ఉన్నవారినే ఎస్పీలుగా కొనసాగించింది ప్రభుత్వం..
Read Also: Mirai : అతను నా కుటుంబాన్ని నిలబెట్టాడు.. మనోజ్ ఎమోషనల్
* డాక్టర్ బీఆర్ఎస్ అంబేద్కర్ కోనసీమ – రాహుల్ మీనా
* బాపట్ల- ఉమామహేశ్వర్
* నెల్లూరు – అజితా వేజెండ్ల
* తిరుపతి – సుబ్బారాయుడు
* అన్నమయ్య – ధీరజ్ కునుగిలి
* కడప – నచికేత్
* నంద్యాల్ – సునీల్ షెరాన్ ఇలా.. ఈ ఏడు జిల్లాలకు ఎస్పీలుగా కొత్త అధికారులు నియమించింది ప్రభుత్వం..
* విజయనగరం- ఎఆర్ దామోదర్
* కృష్ణా – విద్యాసాగర్ నాయుడు
* గుంటూరు – వకుల్ జిందాల్
* పల్నాడు – డి కృష్ణారావు
* ప్రకాశం– హర్షవర్థన్ రాజు
* చిత్తూరు – తుషార్ డూడి
* శ్రీ సత్యసాయి – సతీష్ కుమార్‌ను బదిలీ చేసింది..
మరోవైపు, యథాతథంగా శ్రీకాకుళం, పార్వతీపురం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, అనంతపురం, కర్నూలు జిల్లాల ఎస్పీలను కొనసాగించింది కూటమి ప్రభుత్వం..