Thalliki Vandanam Scheme: ‘తల్లికి వందనం’పై గుడ్‌న్యూస్.. అధికారులకు మంత్రి లోకేష్ కీలక ఆదేశాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Thalliki Vandanam Scheme: తల్లికి వందనంపై శుభవార్త చెప్పింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ప్రతిష్ఠాత్మకంగా అమలు చేయనున్న ‘తల్లికి వందనం’ పథకం కింద ఆర్థిక సాయాన్ని జులై మూడో వారంలో అందించేలా అన్ని చర్యలు చేపట్టాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. ఈ పథకానికి సంబంధించిన తల్లుల ఆధార్ వెరిఫికేషన్ ప్రక్రియ త్వరలోనే పూర్తవుతుందని అధికారులు వెల్లడించారు. ఉండవల్లిలోని తన నివాసంలో విద్యాశాఖ ఉన్నతాధికారులతో మంత్రి లోకేష్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తల్లికి వందనం, బడి పిలుస్తోంది, షైనింగ్ స్టార్స్, మెగా పీటీఎం, యోగాంధ్ర, టెట్ నిర్వహణ తదితర అంశాలపై అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరాలు సమర్పించారు.
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరికల పరిస్థితిపై మంత్రి లోకేష్ ప్రత్యేకంగా ఆరా తీశారు. విద్యార్థుల ప్రవేశాల సంఖ్యను పెంచేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. తల్లికి వందనం పథకానికి సంబంధించిన అన్ని ప్రక్రియలను వేగవంతం చేసి అర్హులైన లబ్ధిదారులకు సకాలంలో ఆర్థిక సాయం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సమీక్షలో భాగంగా జూన్ 29న ‘షైనింగ్ స్టార్స్’ కార్యక్రమం నిర్వహించాలని, జులై మూడో వారంలో రాష్ట్రవ్యాప్తంగా ‘మెగా పీటీఎం’ నిర్వహించాలనే నిర్ణయం తీసుకున్నారు. విద్యా రంగంలో నాణ్యత పెంపుతో పాటు విద్యార్థుల హాజరు, విద్యా ప్రమాణాల మెరుగుదలపై ప్రత్యేక దృష్టి సారించాలని మంత్రి లోకేష్ అధికారులకు సూచించారు. ‘తల్లికి వందనం’ పథకం అమలు ద్వారా విద్యార్థుల తల్లులకు ఆర్థిక భరోసా కల్పించడంతో పాటు విద్యాభ్యాసాన్ని మరింత ప్రోత్సహించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని సమావేశంలో పేర్కొన్నారు మంత్రి నారా లోకేష్..
Also Read
- Deputy CM Pawan Kalyan: గురువాయూరప్ప సన్నిధిలో ఏపీ డిప్యూటీ సీఎం.. ప్రత్యేక పూజలు చేసిన పవన్..
- AP Weather Alert: 2 రోజుల పాటు విస్తారంగా వర్షాలు.. ఈ జిల్లాలకు హెచ్చరికలు
- AP Government: వడ్డెర్లకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. 16 జిల్లాల్లో 32 చోట్ల క్వారీ భూములు.. 50% రాయితీ
- CM Chandrababu: Gen Zపై సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు..
తాజావార్తలు
-
BRICS 2026: మోదీ చేతుల్లో జిన్‌పింగ్, పుతిన్.. బ్రిక్స్ ఫోటోతో ప్రపంచం షేక్..
-
PM Modi – Netanyahu: బ్రిక్స్ వేళ, ఇజ్రాయిల్ ప్రధానికి మోడీ శుభాకాంక్షలు..
-
Khairatabad Ganesh: ఖైరతాబాద్ గణేష్‌కు భారీ రద్దీ.. ట్రాఫిక్ పోలీసుల బిగ్ ప్లాన్
-
Amit Majithia: స్టార్ క్రికెటర్ల పరువు గంగపాలు? దుబాయ్ రహస్య విందుల్లో బయటపడ్డ దిమ్మతిరిగే నిజాలు!
-
Ponguleti Srinivas Reddy : 22Aపై రచ్చ.. BRSపై పొంగులేటి ఫైర్..!
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!