కయాద్ లోహార్ బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో ఫుల్ స్వింగ్‌లో ఉంది. డ్రాగన్‌తో యూత్ హార్ట్‌ను గాయబ్ చేసిన అస్పామీ బ్యూటీ తమిళంలో బిజీగా మారిపోతుంది అనుకుంటే ఇప్పుడు సౌత్ మొత్తం నాదే అంటోంది. ముఖ్యంగా మాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ స్టేటస్ ను అందుకునేందుకు పరుగులు పెడుతుంది. వరుసగా ఒక్కొక్క ఆఫర్‌ను తన బ్యాగ్‌లో వేసుకుంటోంది ఈ భామ.
Also Read : GBU : మొత్తానికి ఆ స్టార్ హీరో సినిమా శాటిలైట్ డీల్ క్లోజ్ అయింది
కాల్షీట్స్ ఖాళీ లేనంతగా బిజీగా ఉన్న కొత్త సినిమా ఏవోచ్చిన క్యాచ్ చేసేస్తుంది కయాద్. ప్రజెంట్ ఆమె ఖాతాలో అరడజన్‌కు పైగా చిత్రాలున్నాయి. తమిళంలో శింబుతో పాటు జీవీ ప్రకాష్ ఇమ్మోర్టల్, ఇదయం మురళిలో అధర్వతో స్క్రీన్ షేర్ చేసుకుంటోంది. తెలుగులో విశ్వక్ సేన్ ఫంకీలో కన్ఫర్మ్ అయింది. వెంకట్ ప్రభు నెక్ట్స్ సినిమాకు ఈమె పేరే పరిశీలిస్తున్నట్లు టాక్ వచ్చింది. ప్రదీప్ రంగనాథన్ డ్రాగన్ చూపించిన ఎఫెక్ట్ తో తమిళంలో కయాద్ బిజీగా మారడంలో నో డౌట్. కానీ మలయాళంలో కూడా ఈ బ్యూటీ బాగా పాపులర్ అవుతోంది. మాలీవుడ్ స్టార్ హీరోలతో జోడీ కట్టే ఛాన్స్ కొల్లగొడుతోంది. ఇప్పటికే మలయాళంలో టూ ఫిల్మ్స్‌తో చేరువైన ఈ భామ.. నెక్ట్స్ నివిన్ పౌలీతో ‘తారం’లో చేస్తోంది. టొవినో థామస్ సరసన ‘పల్లిచట్టంబీ”లో నటిస్తోంది. రీసెంట్లీ ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లింది. 1950లో కేరళలోని కొండ ప్రాంతాలలో వలస వచ్చిన రైతుల జీవితాల నేపథ్యంలో పల్లిచట్టంబి తెరకెక్కిస్తున్నాడు డిజో జోస్ ఆంటోనీ. ఇవే కాకుండా దుల్కర్ సల్మాన్ ఐయామ్ గేమ్ చిత్రంలో కూడా నటిస్తుందని టాక్.