TDP-Janasena Seat Sharing Talks: సీట్ల లొల్లి.. కూటమి ముందు జనసేన భారీ డిమాండ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TDP-Janasena Seat Sharing Talks: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేసింది రాష్ట్ర ఎన్నికల సంఘం.. అంతేకాదు.. రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల కోడ్ కూడా అమల్లోకి వచ్చింది.. అయితే, కూటమిలో ఇప్పటి వరకు సీట్లపై ఓ నిర్ణయానికి రాలేదు నేతలు.. టీడీపీ, జనసేన మధ్య సీట్ల సర్దుబాటు అంశంపై చర్చలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో జరిగిన చర్చల పురోగతిని జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు వివరించేందుకు మంత్రి నాదెండ్ల మనోహర్ జనసేన కార్యాలయానికి వెళ్లారు. పవన్ కల్యాణ్‌తో చర్చించి, సీట్ల సర్దుబాటుపై ఆయన అభిప్రాయాలను తెలుసుకున్నారు.
ఇక, పవన్ కల్యాణ్‌తో చర్చలు ముగిసిన అనంతరం నాదెండ్ల మనోహర్ తిరిగి చంద్రబాబు నివాసానికి చేరుకున్నారు. జనసేన అధినేతతో చర్చించిన అంశాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో సీట్ల సర్దుబాటుపై కొద్దిసేపట్లో స్పష్టత వచ్చే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే, టీడీపీ, జనసేన మధ్య సీట్ల పంపకాలపై చర్చలు కొలిక్కి వచ్చిన తర్వాత బీజేపీతో సీట్ల సర్దుబాటు అంశంపై టీడీపీ చర్చలు జరపనున్నట్లు సమాచారం. దీంతో కూటమి పార్టీల మధ్య సీట్ల పంపకాలపై ఉత్కంఠ నెలకొంది. జనసేనకు కేటాయించే స్థానాలు, తదుపరి బీజేపీతో జరిపే చర్చలపై రాజకీయ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. అయితే, 6 కార్పొరేషన్లతో పాటు.. 40 మున్సిపాలిటీలు కోరుతుందట జనసేన పార్టీ.. పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్‌తో చర్చల అనంతరం మళ్లీ మంత్రి నాదెండ్ల మనోహర్ చర్చలకు సీఎం చంద్రబాబు దగ్గరకు రావడంతో.. కాసేపట్లో ఏదో ఒకటి ఫైనల్ కావడం ఖాయమనే చర్చ సాగుతోంది..
Also Read
- AP Model Code of Conduct: ఏపీలో అమల్లోకి ఎన్నికల కోడ్.. కొత్త పథకాలు, ప్రాజెక్టులకు బ్రేక్.. నిబంధనలు ఇవే..
- AP Local Body Election Schedule 2026: ఏపీలో స్థానిక ఎన్నికల నగారా.. పూర్తి షెడ్యూల్ ఇదే..
- AP DSC 2026 Notification: టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. DSC నోటిఫికేషన్ విడుదల
- AP Local Body Elections Schedule: స్థానిక ఎన్నికల సందడి.. మున్సిపల్, ఎంపీటీసీ, పంచాయతీ షెడ్యూల్ వివరాలివే..!
తాజావార్తలు
-
TDP-Janasena Seat Sharing Talks: సీట్ల లొల్లి.. కూటమి ముందు జనసేన భారీ డిమాండ్..
-
Tollywood: దసరా వార్‌లో నైజాంను క్లీన్ స్వీప్ చేసిన మైత్రీ!
-
Meerut Blue Drum Murder: మీరట్ బ్లూ డ్రమ్ మర్డర్.. ముస్కాన్, సాహిల్లకు మరణశిక్ష విధింపు..!
-
Varanasi: గ్లోబల్ హిస్టరీ క్రియేట్ చేసిన ‘వారణాసి’.. హాలీవుడ్ దిగ్గజాలే షాక్!
-
AP Model Code of Conduct: ఏపీలో అమల్లోకి ఎన్నికల కోడ్.. కొత్త పథకాలు, ప్రాజెక్టులకు బ్రేక్.. నిబంధనలు ఇవే..
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..