AP Local Body Election Schedule 2026: ఏపీలో స్థానిక ఎన్నికల నగారా.. పూర్తి షెడ్యూల్ ఇదే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Local Body Election Schedule 2026: ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ను రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) విడుదల చేసింది. ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా ఎన్నికల వివరాలను వెల్లడించారు. రాష్ట్రంలో మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు, మున్సిపల్ కార్పొరేషన్లు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, గ్రామ పంచాయతీలకు దశలవారీగా ఎన్నికలు నిర్వహించేందుకు షెడ్యూల్ ప్రకటించారు.
100 పట్టణ స్థానిక సంస్థలకు నోటిఫికేషన్
రాష్ట్రంలోని 100 అర్బన్ లోకల్ బాడీలకు అక్టోబర్ 14న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ఎస్ఈసీ ప్రకటించింది. వీటిలో 77 మున్సిపాలిటీలు, 10 నగర పంచాయతీలు, 13 మున్సిపల్ కార్పొరేషన్లు ఉన్నాయి. ఈ ఎన్నికలకు అక్టోబర్ 16 నుంచి 18 వరకు నామినేషన్లు దాఖలు చేసేందుకు అవకాశం కల్పించారు. అక్టోబర్ 21 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంటుంది. అక్టోబర్ 26తో ఎన్నికల ప్రచారం ముగియనుంది. అక్టోబర్ 28న పోలింగ్, అక్టోబర్ 30న ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నట్లు షెడ్యూల్లో పేర్కొన్నారు.
Also Read
ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల షెడ్యూల్
ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు అక్టోబర్ 19న నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. అక్టోబర్ 21 నుంచి 23 వరకు నామినేషన్లు దాఖలు చేసేందుకు అవకాశం ఉంటుంది. అక్టోబర్ 27 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు కల్పించారు. నవంబర్ 3న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ నిర్వహించనున్నారు. అవసరమైతే నవంబర్ 4న రీపోలింగ్ చేపట్టనున్నారు. నవంబర్ 5న ఓట్ల లెక్కింపు నిర్వహిస్తారు. నవంబర్ 11 నాటికి ఈ ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియను పూర్తి చేయాలని ఎన్నికల సంఘం లక్ష్యంగా పెట్టుకుంది.
మూడు దశల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు
రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలను మూడు దశల్లో నిర్వహించనున్నారు. తొలి దశ ఎన్నికలకు నవంబర్ 13న నోటిఫికేషన్ విడుదల చేస్తారు. నవంబర్ 26న పోలింగ్ నిర్వహించి, అదే రోజు ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను ప్రకటిస్తారు. ఇక, రెండో దశ గ్రామ పంచాయతీ ఎన్నికలకు నవంబర్ 16న నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. నవంబర్ 29న పోలింగ్ నిర్వహించి, అదే రోజు ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన ఉంటుంది. మూడో దశ ఎన్నికలకు నవంబర్ 19న నోటిఫికేషన్ విడుదల చేస్తారు. డిసెంబర్ 2న పోలింగ్ నిర్వహించి, అదే రోజు ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను ప్రకటించనున్నారు.
మరో 23 పట్టణ స్థానిక సంస్థలకు తర్వాత ఎన్నికలు
మిగిలిన 23 అర్బన్ లోకల్ బాడీలకు సంబంధించి కోర్టు ఉత్తర్వులు వచ్చిన తర్వాత ఎన్నికలు నిర్వహిస్తామని ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా వెల్లడించారు. ఈ సంస్థలకు సంబంధించిన ఎన్నికల తేదీలు కోర్టు ఆదేశాల అనంతరం నిర్ణయించనున్నారు.
అభ్యర్థులకు 24 గంటల్లో ధ్రువీకరణ పత్రాలు
మరోవైపు.. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు అవసరమైన కుల ధ్రువీకరణ పత్రాలను 24 గంటల్లో జారీ చేయాలని ఎన్నికల సంఘం సూచించింది. అలాగే నో డ్యూ సర్టిఫికెట్లను కూడా 24 గంటల్లో అందించాలని స్పష్టం చేసింది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు ధ్రువీకరణ పత్రాల జారీలో జాప్యం జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించింది. మొత్తంగా, ఏపీలో పట్టణ స్థానిక సంస్థలు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, గ్రామ పంచాయతీలకు దశలవారీగా ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. డిసెంబర్ 2తో మూడు దశల గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ పూర్తికానుంది.
తాజావార్తలు
-
Dulquer Salmaan: “టైటిల్ రోల్ నాది కాదు.. అయినా ఈ సినిమాకి సైన్ చేశా”
-
Rapthadu School Attack : రాప్తాడు విద్యార్థినిపై దాడి కేసులో ట్విస్ట్.. పోలీసుల కాల్పుల్లో నిందితుడికి గాయాలు..
-
Amitabh Bachchan: టైగర్ ష్రాఫ్పై ఫైరింగ్ ఎఫెక్ట్.. గ్లాస్ షీల్డ్ వెనుక బిగ్ బి!
-
Ranbir Kapoor: లక్ష్మణుడి త్యాగం ఈ జనరేషన్లో సాధ్యమా? రణ్బీర్ క్వశ్చన్ వైరల్!
-
PV Sindhu Creates History : హైలో ఓపెన్లో సింధు చరిత్ర.. తొలి భారతీయ మహిళగా అరుదైన ఘనత
ట్రెండింగ్
-
Traditional Indian Sweets : ఈ దీపావళికి కొత్త రుచులు.. దేశంలోని 9 ప్రత్యేక స్వీట్లు
-
Medicine Storage Tips : ఇంట్లో మందులు ఎక్కడ పెడుతున్నారు? ఈ చిన్న పొరపాట్లు చేయొద్దు
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..