Varanasi: గ్లోబల్ హిస్టరీ క్రియేట్ చేసిన ‘వారణాసి’.. హాలీవుడ్ దిగ్గజాలే షాక్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Varanasi: ప్రపంచ సినిమా బాక్సాఫీస్‌ను దశాబ్దాలుగా ఏలుతున్న హాలీవుడ్ లెజెండరీ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ రికార్డులకే దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి గండికొట్టారు. సినిమా ఇంకా సెట్స్ పైనే ఉండగా, కేవలం గ్లింప్స్‌తోనే ప్రపంచ సినీ రంగాన్ని నిర్ఘాంతపరిచే సరికొత్త చరిత్ర లిఖించారు. అంతర్జాతీయంగా అత్యంత ప్రతిష్టాత్మకమైన IMAX అధికారిక యూట్యూబ్ ఛానల్లో ‘అవతార్’ పేరిట ఉన్న ఆల్‌టైమ్ నంబర్ 1 రికార్డును రాజమౌళి ‘వారణాసి’ తిరగరాసింది. విజువల్ వండర్స్‌కు పెట్టింది పేరైన జేమ్స్ కామెరూన్ సృష్టించిన ‘అవతార్: ది వే ఆఫ్ వాటర్’ ఇప్పటివరకు IMAX వేదికపై 82.5 లక్షల వ్యూస్‌తో తిరుగులేని స్థానంలో కొనసాగింది. అయితే అనూహ్యంగా దూసుకొచ్చిన ‘వారణాసి’ గ్లింప్స్ సునామీ సృష్టించి ఏకంగా కోటి వ్యూస్ మార్కును దాటేసింది. దీంతో అగ్రస్థానంలో ఉన్న ‘అవతార్ 2’ రెండో స్థానానికి పడిపోగా, మార్వెల్ భారీ చిత్రం ‘డాక్టర్ స్ట్రేంజ్ 2’ (41.4 లక్షల వ్యూస్) మూడో స్థానానికి పరిమితమైంది. హాలీవుడ్ స్టూడియోల అడ్డా అయిన IMAX చరిత్రలోనే కోటి వ్యూస్ మైలురాయిని తాకిన ఏకైక వీడియోగా ‘వారణాసి’ అగ్రపీఠాన్ని కైవసం చేసుకుంది.
ఇక్కడ అందరినీ విస్మయానికి గురిచేస్తున్న అసలు విషయం ఏమిటంటే.. ‘అవతార్’, ‘డాక్టర్ స్ట్రేంజ్’ చిత్రాలు పూర్తి స్థాయి ట్రైలర్లతో ఈ వ్యూస్ సాధిస్తే, ‘వారణాసి’ మాత్రం కనీసం షూటింగ్ కూడా పూర్తిగా కంప్లీట్ చేసుకోకుండానే చిన్న గ్లింప్స్‌తో ఈ రికార్డును బద్దలుకొట్టింది. కేవలం ప్రాజెక్ట్ ఇంట్రడక్షన్ గ్లింప్స్‌తోనే జేమ్స్ కామెరూన్ లాంటి గ్లోబల్ దిగ్గజాన్ని వెనక్కి నెట్టడం భారతీయ చిత్ర పరిశ్రమ సత్తాకు నిదర్శనంగా నిలిచింది. ఒక తెలుగు దర్శకుడి ఆలోచన హాలీవుడ్ కంటెంట్‌ను మించి ప్రపంచవ్యాప్తంగా ప్రతిధ్వనిస్తుండటం చూస్తుంటే, రేపు ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పుడు అంతర్జాతీయ మార్కెట్లను ఏ రేంజ్లో షేక్ చేస్తుందోనని నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు.
Also Read
తాజావార్తలు
-
Varanasi: గ్లోబల్ హిస్టరీ క్రియేట్ చేసిన ‘వారణాసి’.. హాలీవుడ్ దిగ్గజాలే షాక్!
-
AP Model Code of Conduct: ఏపీలో అమల్లోకి ఎన్నికల కోడ్.. కొత్త పథకాలు, ప్రాజెక్టులకు బ్రేక్.. నిబంధనలు ఇవే..
-
Israel: ఇజ్రాయిల్ వెళ్లే విమానాల్లో పాక్ పైలట్లు, సిబ్బందిపై నిషేధం..!
-
DRDO QKD test: DRDO కీలక విజయం.. క్వాంటం టెక్నాలజీతో రక్షణ సమాచారానికి మరింత భద్రత!
-
AP Local Body Election Schedule 2026: ఏపీలో స్థానిక ఎన్నికల నగారా.. పూర్తి షెడ్యూల్ ఇదే..
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..