టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి (Chandrababu) నివాసంలో కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ (Gajendra Singh Shekawat) బృందంతో పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, జనసేన ప్లానింగ్ కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar) కూడా ఉన్నారు.
ఇవాళ ఉదయం 11 గంటలకు కేంద్రమంత్రి గజేంద్ర షెకావత్ ( Gajendra singh Shekawat )తో చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ( Pawan kalyan ) సమావేశం కానున్నారు. ఈ భేటీలో సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ఖరారుపై తీవ్ర కసరత్తులు చేసే అవకాశం ఉంది.
రేపు టీడీపీ - బీజేపీ - జనసేన పార్టీల ఉమ్మడి సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి టీడీపీ అధినేత చంద్రబాబు హాజరుకానున్నారు. అందుకోసమని.. రేపు ఉదయం హైదరాబాదు నుంచి రానున్నారు. రేపు ఉదయం 11 గంటలకు కేంద్ర మంత్రి షెకావత్, చంద్రబాబు, పవన్ ఉమ్మడి సమావేశం జరగనుంది. సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ఖరారుపై కసరత్తులు చేయనున్నారు. రేపటి మూడు పార్టీల అగ్ర నేతల భేటీలో ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి పాల్గొననున్నారు.
ఢిల్లీలో బీజేపీ-టీడీపీ-జనసేన మధ్య పొత్తు ఖరారైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. ఏపీలో అభ్యర్థుల ఖరారుపై బీజేపీ తుది కసరత్తు ప్రారంభించింది. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ నేతృత్వంలోని బృందం ఏపీకి వచ్చింది. గజేంద్ర సింగ్ షెకావత్ బృందంలో ఒడిశా ఎంపీ జై జయంత్ పాండా ఉన్నారు. అభ్యర్థుల ఎంపికపై గజేంద్ర సింగ్ షెకావత్ తో పురంధేశ్వరి భేటీ అయ్యారు. ఈ చర్చల్లో బీజేపీ అగ్ర నేతలు శివ ప్రకాష్, మధుకర్ కూడా…
రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌కు ఢిల్లీ కోర్టు సమన్లు జారీ చేసింది. ఆగస్టు 7వ తేదీన కోర్టుకు హాజరు కావాలని ఢిల్లీ రౌస్ ఎవెన్యూ కోర్టు ఆ నోటిసుల్లో పేర్కొనింది. కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, ఆశోక్ గెహ్లాట్‌పై వేసిన పరువు నష్టం దావా ఆధారంగా ఈ నోటీసులను ఢిల్లీ రౌస్ ఎవెన్యూ కోర్టు జారీ చేసింది. సుమారు 900 కోట్ల రూపాయలకు సంబంధించి ఆశోక్ గెహ్లాట్ చేసిన ఆరోపణలకు గానూ కేంద్ర…