సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావుకు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది.. కొమ్మినేనికి బెయిల్ మంజూరు చేసింది సుప్రీంకోర్టు.. కొమ్మినేనిని వెంటనే విడుదల చేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది.. అసలు, విశ్లేషకుడి వ్యాఖ్యలతో జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావుకి సబంధం లేదని స్పష్టం చేసింది.. కొమ్మినేని విడుదల నిబంధనలు ట్రయల్ కోర్టు చూసుకుంటుందని జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ మన్మోహన్ ధర్మాసనం పేర్కొంది..