డీఎస్సీ 2025 పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వెబ్‌సైట్ లోకి మెరిట్ లిస్ట్ ను విడుదల చేసింది. రేపు ఉదయానికి సెలక్షన్ లిస్ట్ సిద్ధం చేసి రోస్టర్ పాయింట్స్ కి అనుగుణంగా ఎంపికైన అభ్యర్థులకు సమాచారం అందించనున్నారు అధికారులు. ఈ రాత్రికే అభ్యర్థులకు నేరుగా మొబైల్ ఫోన్ లకు సమాచారం ఇవ్వనున్నారు. 21 నుండి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ నిర్వహించనున్నట్లు సమాచారం. సెప్టెంబర్ 5 నాటికి పాఠశాలల్లో కి కొత్త ఉపాధ్యాయులు కొలవుదీరనున్నట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్…
జూలై నుంచి పాఠశాలలపై నిత్య పర్యవేక్షణ ఉండనుంది. జూలై నుంచి ప్రతి పాఠశాలలో అధికారులు పర్యటన చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అకడమిక్ క్యాలండర్ ప్రకారం సిలబస్ ఫాలో అవుతున్నారా? లేదా? ఉపాధ్యాయులు విద్యార్థులకు బోధన ఎలా చేస్తున్నారనే అంశాలను పరిశీలించనున్నారు. విద్యార్థుల విద్యా ప్రమాణాలు – పిల్లల సాంకేతిక, విద్యా నైపుణ్యాల స్థాయి ఏ మేరకు ఉంది. స్టూడెంట్ ఎసైన్ బుక్ పై పరిశీలన ఉండనుంది. PM-POSHAN (MDM) అమలు, మధ్యాహ్న భోజన పథకం పాఠశాలల్లో సక్రమంగా…
విద్యార్థులను మరింత ప్రోత్సహించే విధంగా చర్యలు తీసుకుంటుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. అందులో భాగంగా 2024-25 విద్యాసంవత్సరానికి గానూఉత్తమ విద్యార్థులకు షైనింగ్ స్టార్స్ అవార్డులు ఇవ్వాలని నిర్ణయించింది.. టెన్త్, ఇంటర్ లో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు ఈ షైనింగ్ స్టార్స్ అవార్డులు అందించనున్నారు.. ఇక, షైనింగ్ స్టార్ అవార్డులు ఇచ్చేందుకు మార్గదర్శకాలు విడుదల చేసింది ఏపీ పాఠశాల విద్యాశాఖ.
ఆంధ్రప్రదేశ్‌లో మెగా డీఎస్సీ నిర్వహణకు సిద్ధమైంది ప్రభుత్వం.. దీనికోసం మెగా డీఎస్సీ పరీక్షలకు షెడ్యూల్ విడుదల చేసింది.. ఆ షెడ్యూల్ ప్రకారం.. జూన్ 6వ తేదీ నుంచి 30వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ మేరకు ఏపీ విద్యాశాఖ ఏర్పాట్లలో నిమగ్నమైంది.. కాగా, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు కూటమి ప్రభుత్వం 16,347 పోస్టులతో మెగా డీఎస్సీ ప్రకటించింది..
ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది.. ఇంటర్మీడియట్ పాఠ్యాంశాల్లో సమూల మార్పులు తీసుకురాబోతోంది.. ఇంటర్ విద్య లో కీలక మార్పులు వస్తాయి.. పాఠ్య పుస్తకాల్లో మార్పులు చోటు చేసుకుంటాయి.. ఇక మొదటి సంవత్సరం ఖచ్చితంగా పాస్ అవ్వాలన్న నిబంధనకు మినహాయింపు ఇవ్వబోతున్నారు.
భావి తరాలకు స్ఫూర్తిని అందించే సమాజ సేవకులు, శాస్త్రవేత్తలు, విద్యావేత్తల పేర్లతో ప్రభుత్వ పథకాలను అమలు చేయడం హర్షణీయమని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖలో పథకాలను డా.సర్వేపల్లి రాధాకృష్ణన్, డొక్కా సీతమ్మ, అబ్దుల్ కలాం పేర్లతో అమలు చేయాలని నిర్ణయం తీసుకున్న సీఎం చంద్రబాబు, విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్‌కు అభినందనలు తెలుపుతూ పవన్ కల్యాణ్ ట్వీట్ చేశారు.
విద్యావిధానంలో మార్పుల కోసం తీవ్రంగా ప్రయత్నాలు సాగుతున్నాయి.. ప్రభుత్వ స్కూళ్లలోనూ ఇంగ్లీష్ మీడియంపై ఇప్పటికే నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.. విద్యాశాఖపై సమీక్ష నిర్వహించిన సీఎం వైఎస్ జగన్.. అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.. నూతన విద్యావిధానం కింద తీసుకున్న నిర్ణయాలపై సమీక్ష నిర్వహించారు.. విద్యాశాఖలో తీసుకున్న నిర్ణయాలు.. వాటి అమలు తీరును సీఎంకు వివరించిన అధికారులు. నూతన విద్యావిధానానికి అనుగుణంగా ఇప్పటివరకు మ్యాపింగ్ కాకుండా మిగిలిన స్కూళ్లను కూడా మ్యాపింగ్ చేశామని అధికారులు తెలిపారు..…
స్కూళ్ల నిర్వహణ, విద్యార్థుల హాజరు, అమ్మ ఒడి, విద్యాకానుకపై సమీక్ష నిర్వహించారు సీఎం వైఎస్ జగన్.. సంబంధిత అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.. కరోనా తర్వాత పాఠశాలల్లో పరిస్థితులపై ఆరా తీసిన ఆయన.. పాఠశాలల్లో కరోనా నివారణ చర్యలను అడిగి తెలుసుకున్నారు.. విద్యాకానుకలో భాగంగా ఇవ్వనున్న స్పోర్ట్స్ డ్రస్, షూలను పరిశీలించి.. వాటికి కొన్ని సూచనలు చేశారు.. ప్రభుత్వం పాఠశాలల్లో హాజరు భారీగా పెరిగిందని, ప్రస్తుతం 91శాతం హాజరు ఉందని ఈ సందర్భంగా సీఎంకు తెలిపారు…