Mithra Mandali: మ్యాడ్ నెస్ ఇప్పుడే మొదలైంది.. ఆకట్టుకుంటున్న ‘మిత్ర మండలి’ ఫస్ట్ లుక్
- ఆకట్టుకుంటున్న 'మిత్ర మండలి' ఫస్ట్ లుక్
- నీలిరంగు ముసుగుల వెనుక ఉన్న గ్యాంగ్ ను పరిచయం చేసింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బన్నీ వాస్ సమర్పణలో సప్త అశ్వ మీడియా వర్క్స్, వైరా ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న నూతన చిత్రం నుంచి ఇటీవల విడుదలైన ప్రీ లుక్ కి విశేష స్పందన లభించిన సంగతి తెలిసిందే. ముసుగు అవతారాలలో ఉన్న నటులు ఎవరో తెలుసుకోవాలనే ఆసక్తి అందరిలో కలిగింది. దీని గురించి సామాజిక మాధ్యమాల్లో కూడా తెగ చర్చ జరిగింది. తాజాగా ఈ చిత్రం నుంచి టైటిల్ తో కూడిన ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు నిర్మాతలు.
Also Read:Rekha Gupta: సీఎం రేఖా గుప్తాకు అధికారిక బంగ్లా కేటాయింపు.. కొత్త అడ్రస్ ఎక్కడంటే..!
Also Read
- Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
- Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
- Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
- Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
ఈ చిత్రానికి “మిత్ర మండలి” అనే ఆసక్తికర టైటిల్ ను ఖరారు చేశారు. టైటిల్ తో పాటు, అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా విడుదలైంది. ఫస్ట్ లుక్ అందరి అంచనాలను అందుకునేలా కట్టిపడేసేలా ఉంది. ఈ పోస్టర్ నీలిరంగు ముసుగుల వెనుక ఉన్న గ్యాంగ్ ను పరిచయం చేసింది. ప్రియదర్శి, రాగ్ మయూర్, విష్ణు ఓయ్, ప్రసాద్ బెహరా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. అపరిమిత వినోదాన్ని అందించడానికి ఈ గ్యాంగ్ సిద్ధమవుతోంది. సోషల్ మీడియా సంచలనం నిహారిక ఎన్.ఎం. “మిత్ర మండలి” చిత్రంతో తెలుగులోకి అరంగేట్రం చేస్తుండటం విశేషం. సోషల్ మీడియా ద్వారా వివిధ భాషల ప్రేక్షకులకు చేరువైన నిహారిక.. ఇటీవల ‘మిషన్ ఇంపాజిబుల్ – ది ఫైనల్ రెకనింగ్’ కోసం టామ్ క్రూజ్‌తో కలిసి పనిచేసి వార్తల్లో నిలిచారు.
Also Read:Yemmiganur: ఎమ్మిగనూరు టీడీపీలో చల్లారని మంటలు.. నేతల రాజీనామా బాట..!
అద్భుతమైన నటన, కామిక్ టైమింగ్, భిన్నమైన పాత్రల ఎంపికతో ప్రియదర్శి తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందారు. ఆయనకు ‘మ్యాడ్’ ఫేమ్ విష్ణు ఓయ్, రాగ్ మయూర్, ప్రసాద్ బెహరా వంటి ప్రతిభగల నటులు తోడయ్యారు. ఈ నలుగురు కలిసి ‘మిత్ర మండలి’తో అద్భుతమైన వినోదాన్ని అందిస్తారు అనడంలో సందేహం లేదు. బన్నీ వాస్ తాను నూతనంగా ప్రారంభించిన బి.వి. వర్క్స్ పతాకంపై ‘మిత్ర మండలి’ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. సప్త అశ్వ మీడియా వర్క్స్, వైరా ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై అభిరుచి గల నిర్మాతలు కళ్యాణ్ మంతిన, భాను ప్రతాప, డా. విజయేందర్ రెడ్డి తీగల నిర్మిస్తున్నారు. సోమరాజు పెన్మెత్స సహ నిర్మాత.
Also Read:Subhashree Rayaguru: నిర్మాతతో బిగ్ బాస్ కంటెస్టెంట్ ఎంగేజ్మెంట్.. ఫొటోలను షేర్ చేసిన బ్యూటీ
నూతన దర్శకుడు విజయేందర్ ఎస్ దర్శకత్వం వహిస్తున్న ‘మిత్ర మండలి’ చిత్రానికి అద్భుతమైన సాంకేతిక బృందం పని చేస్తోంది. ఆర్.ఆర్. ధృవన్ సంగీతం అందిస్తున్నారు. సినిమాటోగ్రాఫర్‌గా సిద్ధార్థ్ ఎస్.జె, ఎడిటర్‌గా పీకే, ఆర్ట్ డైరెక్టర్‌గా గాంధీ నడికుడికర్, కాస్ట్యూమ్ డిజైనర్‌గా శిల్పా టంగుటూరు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా రాజీవ్ కుమార్ రామా వ్యవహరిస్తున్నారు. ‘మిత్ర మండలి’ అనేది స్నేహం ప్రధానంగా నడిచే కథ. ఇది ప్రేక్షకులకు సరికొత్త వినోదాన్ని అందించనుంది. మ్యాడ్ నెస్ ఇప్పుడే మొదలైంది. ఈ సినిమాకి సంబంధించిన మరిన్ని ఆసక్తికర విషయాలు త్వరలో వెల్లడి కానున్నాయి.
https://youtube.com/shorts/2CLKuLN4vDc?si=cUyO_SzmCEjXfVFh
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!