డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన శాఖలోని ఇంజనీరింగ్ అధికారుల పని తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. నిధులు అందుబాటులో ఉన్నప్పటికీ.. పనులు ఆశించినంత వేగంగా జరగడం లేదంటూ అధికారులను నిలదీశారు. మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి మరియు అటవీ శాఖ ఇంజనీరింగ్ అధికారులతో పవన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పల్లె పండగ 2.0, అడవి తల్లి బాట పనుల పురోగతి, జల్ జీవన్ మిషన్, స్వమిత్వ పథకం సహా ప్రధాన కార్యక్రమాల…
పంచాయతీ రాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ విభాగాల్లో వివిధ పోస్టులకు ఎంపికైన 922 మందికి అభ్యర్థులకు నేడు సీఎం రేవంత్ రెడ్డి ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు. రవీంద్ర భారతిలో నిర్వహించిన కొలువుల పండుగ కార్యక్రమానికి సీఎం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బిల్డ్ నౌ పోర్టల్ ను ఆవిష్కరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగించారు. అభ్యర్థులు నియామక పత్రాలు గురించి దశాబ్దకాలం ఎదురుచూశారన్నారు. ఉద్యోగ బాధ్యత అనిర్వచనీయ ఆనందాయకమని తెలిపారు.
Minister Seethakka: హైదరాబాద్ నగరంలోని ఎర్రమంజిల్ లో ఉన్న మిషన్ భగీరథ కార్యాలయంలో పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్క సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి పంచాయతీరాజ్ & గ్రామీణాభివృద్ధి కార్యదర్శి లోకేష్ కుమార్, డైరెక్టర్ సృజనతో పాటు అన్ని జిల్లాల డిఆర్డిఓల అధికారులు హాజరయ్యారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం అమలుపై దిశానిర్దేశం చేస్తూ మంత్రి పలు కీలక సూచనలు చేశారు. కూలీల బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా నగదు బదిలీ చేస్తామన్న మంత్రి,…
ప్రతి గ్రామంలో అభివృద్ధి పనులు సత్వరమే మొదలుపెట్టాలని, కూటమి పాలన మొదలుపెట్టాక పంచాయతీలకు నిధుల సమస్య లేకుండా చేశామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.
రోడ్ల నాణ్యతపైనా మరింత దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు సీఎం వైఎస్ జగన్.. వేసిన మరుసటి సంవత్సరమే మళ్లీ రిపేరు చేయాల్సిన పరిస్థితి రాకూడదన్నారు.. ఇంజినీర్లు వీటి నాణ్యతపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు.. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలపై సమీక్ష సందర్భంగా ఉపాధి హామీపై కూడా సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఉపాథి హామీలో భాగంగా ఈ ఏడాది 1500 లక్షల పని దినాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకోవాలన్నారు.. ఇప్పటి వరకూ 215.17…