JC Prabhakar Reddy: భిక్షగాళ్ల సమస్యకు శాశ్వత పరిష్కారం.. తాడిపత్రిలో జేసీ కొత్త ప్లాన్.. డెడ్‌లైన్ పెట్టి మరి..!
- తాడిపత్రిని భిక్షగాళ్ల రహిత పట్టణంగా మారుస్తాం..
- భిక్షాటన చేస్తున్న చిన్నారులకు చదువు..
- జేసీ ప్రభాకర్ రెడ్డి కీలక ప్రకటన నెల రోజుల్లో తాడిపత్రిలో భిక్షగాళ్లు కనిపించరన్న జేసీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
JC Prabhakar Reddy: అనంతపురం జిల్లా తాడిపత్రిని భిక్షగాళ్ల రహిత పట్టణంగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపడతామని తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రకటించారు. వచ్చే నెల రోజుల్లో పట్టణంలో రోడ్లపై భిక్షాటన చేస్తున్న వారిని గుర్తించి వారికి అవసరమైన సహాయం అందిస్తామని తెలిపారు. భిక్షాటన చేయడాన్ని నిషేధించే చట్టం ఏదీ లేకపోయినా, తాడిపత్రిలో భిక్షగాళ్లు లేకుండా చేయాలన్నదే తమ లక్ష్యమని జేసీ ప్రభాకర్ రెడ్డి చెప్పారు. కాళ్లు, చేతులు లేని వారు లేదా శారీరకంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారు భిక్షాటన చేయాల్సిన పరిస్థితి అర్థం చేసుకోవచ్చని, కానీ ఆరోగ్యంగా ఉండి చిన్న పిల్లలతో కలిసి భిక్షాటన చేయడం బాధాకరమన్నారు.
తల్లిదండ్రులు లేని చిన్నారులు భిక్షాటన చేస్తుంటే వారిని తాను దత్తత తీసుకుని విద్య అందించే బాధ్యత చేపడతానని ప్రకటించారు జేసీ ప్రభాకర్ రెడ్డి… ప్రస్తుతం తాడిపత్రిలో భిక్షాటన చేస్తున్న చిన్నారుల సంక్షేమాన్ని తానే చూసుకుంటానని తెలిపారు. అలాగే వృద్ధులు, వికలాంగులు భిక్షాటన చేస్తున్నట్లయితే స్వచ్ఛంద సేవా సంస్థల సహకారంతో వారికి ఆశ్రయం, అవసరమైన సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు. వారి కష్టసుఖాల్లో తాను అండగా ఉంటానని, వారికి అవసరమైన సహాయాన్ని అందిస్తానని హామీ ఇచ్చారు. తాడిపత్రిలో చిన్నారులు భిక్షాటన చేస్తున్న దృశ్యాలను చూసి తన భార్య కూడా ఎంతో బాధపడిందని జేసీ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. నెల రోజుల్లో భిక్షాటన చేస్తున్న వారిని తీసుకువచ్చి స్నానాలు చేయించి, జుట్టు కత్తిరించి, అనంతరం హోమ్ సెంటర్లకు తరలించి పునరావాసం కల్పించే చర్యలు చేపడతామని వెల్లడించారు తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి..
Also Read
- CM Chandrababu: ఎస్సీ, ఎస్టీల రక్షణకు ప్రత్యేక వ్యవస్థ.. ప్రొటెక్షన్ సెల్, విజిలెన్స్ కమిటీలు.. సీఎం కీలక సమీక్ష
- Perni Nani: స్పోర్ట్స్ కోటానే కాదు.. వికలాంగులు, ఓసీ, బీసీ కోటాల్లోనూ అక్రమాలు.. డీఎస్సీపై పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు
- AP School Education Department: మెగా DSC-2025 నియామకంపై కీలక ప్రకటన.. విచారణకు ఆదేశించిన విద్యాశాఖ
- CM Chandrababu: ఉద్యోగుల సమస్యలపై ఫోకస్.. నేడు 11 సంఘాలతో సీఎం భేటీ.. పీఆర్సీ, ఐఆర్, డీఏపై కీలక చర్చ..
తాజావార్తలు
-
Temple Tourism: అమరావతికి సరికొత్త కాంతి.. తిరుమల తర్వాత ఆ స్థాయిలో అక్కడ శ్రీవారి క్షేత్రం..
-
Harish Rao : అసెంబ్లీలో కాంగ్రెస్‌కు చుక్కలు చూపిస్తాం
-
Dada : ‘దాదా’గా బాలయ్య బ్లాస్టింగ్ ఎంట్రీ: పోలీసులపైనే రివాల్వర్ గురిపెట్టి!
-
Punjab: ఆప్‌లోకి గ్యాంగ్‌స్టర్.. పంజాబ్ ఎన్నికల ముందు కీలక పరిణామం..
-
Mokshagna: బరిలోకి సింబా.. బాలయ్య ఆశీస్సులతో మోక్షజ్ఞ మాస్ ఎంట్రీ!
ట్రెండింగ్
-
Asia Cup 2026: భారత్ చేతిలో 55 పరుగులకే ఆలౌట్.. అయినా పాక్‌దే ఆసియా కప్ టైటిల్ అంటున్న కోచ్!
-
Harmanpreet Kaur History: హర్మన్‌ప్రీత్ కౌర్ నయా చరిత్ర.. క్రికెట్ హిస్టరీలోనే మొట్టమొదటి కెప్టెన్!
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!