Pawan Kalyan: నేషనల్ వార్ మెమోరియల్‌కు పవన్ కల్యాణ్.. వీర జవాన్లకు నివాళి.. ఫొటోలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pawan Kalyan: భారత సైనికుల త్యాగం, ధైర్యం, దేశభక్తికి చిరస్మరణీయ ప్రతీకగా నిలిచే ఢిల్లీలోని నేషనల్ వార్ మెమోరియల్ ను ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సందర్శించారు. అమరస్థూపం వద్ద వీర జవాన్లకు పుష్పగుచ్ఛం సమర్పించి ఘనంగా నివాళులు అర్పించారు. వారి త్యాగాలను స్మరించుకుంటూ వందనం సమర్పించారు. కల్నల్ ఆర్.కె. ఆనంద్ , కెప్టెన్ రోహిత్ గార్గ్ నేతృత్వంలో ఈ వందన సమర్పణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ దేశ భద్రత కోసం ప్రాణ త్యాగం చేసిన అమరవీరుల జీవితాలను సైనికాధికారులను వివరిస్తుంటే శ్రద్ధగా ఆలకించారు. సైనికుల ప్రాణత్యాగాల తాలూకు ఔన్నత్యాన్ని తెలుసుకునే అవకాశం దక్కడం, వారికి నివాళులు అర్పించడం గొప్ప గౌరవంగా భావిస్తున్నట్టు తెలిపారు.
అనంతరం వార్ మెమోరియల్ లో త్యాగచక్ర పేరిట అమర జవాన్ల పేర్లతో చెక్కిన వివరాలను సందర్శించారు పవన్ కల్యాణ్… తెలుగు రాష్ట్రాలకు చెందిన వీర జవాన్ జీ.ఎన్.ఆర్. సతీష్ తదితరుల పేర్లతో చెక్కిన గోడలకు నివాళులు అర్పించారు. సౌర్య చక్ర రాజ్ కుమార్, హావల్దార్ అరుణ్ కుమార్ ల పేర్ల వద్ద పుష్పాలు ఉంచి అంజలి ఘటించారు. అనంతరం వార్ మెమోరియల్ సందర్శనకు గుర్తుగా డిజిటల్ బుక్ లో సంతకం చేశారు. వార్ మెమోరియల్ లో నాలుగు స్మారక చక్రాల విశేషాలను సైనికాధికారులను అడిగి తెలుసుకున్నారు. నిత్యం వేలాది మంది నేషనల్ వార్ మెమోరియల్ ను సందర్శించి తమకు ఇష్టమైన వీర జవాన్ల పేర్లు లిఖించిన గ్రానైట్ ఫలకాలకు నివాళులు అర్పిస్తూ ఉంటారని, వార్ మెమోరియల్ కి వచ్చే వారంతా దీన్ని ఓ దేవాలయంలా భావిస్తారని మిలటరీ అధికారులు వివరించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్, జనసేన పార్లమెంటు సభ్యులు వల్లభనేని బాలశౌరి, తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, లింగమనేని రమేష్, శాసన మండలి సభ్యులు కొణిదల నాగబాబు, టీటీడీ బోర్డు సభ్యులు ఆనంద్ సాయి, పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్లూరి, తెలంగాణ ఇంఛార్జ్ నేమూరి శంకర్ గౌడ్.. తదితరులు వార్ మెమోరియల్ సందర్శించిన వారిలో ఉన్నారు.
Also Read
- Pan IIT Summit : చంద్రబాబు చూపు ఈవీపై.. ఏపీకి కొత్త టెక్నాలజీ ప్లాన్..
- Minister Nara Lokesh: స్పీడ్.. సర్వీస్.. స్టెబిలిటీ.. ఏపీ అభివృద్ధిపై మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు
- Amaravati Flood Control System: 200 ఏళ్ల వర్షపాతంపై అధ్యయనం.. అమరావతి వరద నియంత్రణకు పక్కా ప్లాన్..!
- Bay of Bengal Cyclone Alert: బంగాళాఖాతంలో మరో వాయుగుండం.. ఏపీకి వాతావరణ శాఖ అలర్ట్






తాజావార్తలు
-
CJP vs Congress: ‘‘బీజేపీ కన్నా దారుణం’’.. సీజేపీ-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం.!
-
RC 17: సుకుమార్ ట్రాక్ రికార్డ్.. చరణ్ ఫాన్స్ కి కొత్త టెన్షన్!
-
Harish Rao : సీఎం రేవంత్‌పై హరీశ్ రావు ఫైర్.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై సవాల్
-
CJP: ‘‘రక్షణ కవచాలు’’గా మైనర్లు.. CJP నిరసనలపై NHRC నోటీసులు..
-
Flydubai Terror Attack: ‘‘ఇది టెర్రర్ అటాక్’’.. ఫ్లైదుబాయ్ ఘటనపై యూఏఈ కీలక ప్రకటన!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!