Deputy CM Pawan Kalyan: నేను హోం మినిస్టర్ కాదు.. అది క్రిమినల్స్ అదృష్టం.. లా అండ్ ఆర్డర్‌పై పవన్ ఘాటు వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Deputy CM Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో శాంతిభద్రతల అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. తాను హోం మంత్రి కాదని, లా అండ్ ఆర్డర్ తన పరిధిలో లేదని పేర్కొంటూనే, రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా బలంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. నేరస్తులను కుల కోణంలో చూడకూడదని, క్రిమినల్స్‌కు కులం ఉండదని స్పష్టం చేశారు.. అయితే, నేను హోం మినిస్టర్ కాకపోవడం.. లా అండ్ ఆర్డర్ తన పరిధిలో లేకపోవడం క్రిమినల్స్ అదృష్టమని పేర్కొన్నారు..
‘గుండాలకు గట్టిగా సమాధానం చెబుతాం’
గత రెండేళ్లుగా సహనంగా వ్యవహరించానని చెప్పిన పవన్ కల్యాణ్, ఇకపై గుండాలు, నేరగాళ్ల విషయంలో కఠిన వైఖరి అవలంబిస్తానని హెచ్చరించారు. ఒక తల్లి తన బిడ్డ కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేసిన ఘటనను ప్రస్తావిస్తూ, బాధితుల హక్కులను కూడా గుర్తించాలని అన్నారు. ప్రతి సంఘటనకు కులాన్ని ముడిపెట్టడం సరైన విధానం కాదని పవన్ విమర్శించారు. సమాజాన్ని విభజించే కుల రాజకీయాలు రాష్ట్రానికి హానికరమని పేర్కొన్నారు. తాను ఎప్పుడూ కుల గొడవలను ప్రోత్సహించలేదని, తనను కుల చట్రంలో బంధించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు.
Also Read
- Pramod Sawant: అనుభవం.. స్థిరత్వం.. ఆ తర్వాతే రాజకీయాలు.. 40 ఏళ్ల తర్వాతే పాలిటిక్స్‌లోకి రావాలి..!
- CM Chandrababu : చంద్రబాబు ఫుల్ బిజీ.. ఉత్తరాంధ్రలో ఒక్కరోజే 3 జిల్లాలు..
- YS Jagan: స్థానిక ఎన్నికలపై వైసీపీ ఫోకస్.. 25న జగన్ కీలక భేటీ
- YS Viveka M*urder Case: వైఎస్ వివేకా కేసులో ఈడీ కీలక ప్రకటన.. అవినాష్ రెడ్డి ఇంట్లో రూ.24 లక్షలు సీజ్
అధికారులపై ప్రత్యేక దృష్టి
వైసీపీ పట్ల విధేయత చూపుతున్న అధికారులపై ప్రత్యేక దృష్టి పెడతానని పవన్ కల్యాణ్ హెచ్చరించారు. ఇప్పటి వరకు కొన్ని అంశాల్లో మౌనం పాటించానని, ఇకపై ప్రజల ముందే తన అభిప్రాయాలను వెల్లడిస్తానని తెలిపారు. మరోవైపు.. జనసేన ఎమ్మెల్యేలు, ఎంపీలు మరింత చురుకుగా వ్యవహరించాలని పవన్ సూచించారు. ప్రతి సమస్యకు తాను వ్యక్తిగతంగా వెళ్లడం సాధ్యం కాదని, ప్రజా సమస్యలపై పార్టీ ప్రజాప్రతినిధులు ముందుండాలని పిలుపునిచ్చారు.
తప్పుడు అట్రాసిటీ కేసులపై ఆందోళన
తప్పుడు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులను నిరోధించాల్సిన అవసరం ఉందని పవన్ అభిప్రాయపడ్డారు. కొన్ని కేసుల్లో రాజకీయ ప్రయోజనాల కోసం వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ, సుగాలి ప్రీతి, వైఎస్ వివేకానంద రెడ్డి కేసులను ప్రస్తావించారు.. లా అండ్ ఆర్డర్ బలంగా ఉండాలి.. రూల్ ఆఫ్ లా బలంగా నిలబెట్టాలి.. కులాలకు.. మతాలకు వాట్సాప్ గ్రూపులు ఉన్నప్పుడు లాండ్ ఆర్డర్ కి ఎందుకు ఉండవు? అని ప్రశ్నించారు.. సమాజాన్ని బలహీనపరచడానికి రాలేదు.. గుండాల తొక్కి నార తీస్తా.. రెండేళ్లుగా చాలా సహనంగా ఉన్నాను అన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..
తాజావార్తలు
-
CJP: కాక్రోచ్ పార్టీపై కేసు.. రాజస్థాన్ గ్రామస్తుల ఫిర్యాదు..
-
Karnataka: ఐఏఎస్ అధికారి జ్ఞానేంద్ర కుమార్ అదృశ్యం.. పోలీసుల గాలింపు
-
Allu Arjun: అల్లు ఆర్మీకి షాకింగ్ న్యూస్! బన్నీతో సినిమా ఉంటుందా? ఉండదా? సందీప్ బ్రదర్ కామెంట్స్ వైరల్!
-
Cheque Book New Rules 2026: చెక్‌బుక్ కొత్త రూల్స్.. మీ చెక్‌పై ఈ సెక్యూరిటీ కోడ్ ఉందా? చెక్ చేసుకోండి!
-
Super EL Nino: ముంచుకొస్తున్న సూపర్ ఎల్‌నినో ముప్పు.. 100 ఏళ్ల రికార్డ్ బద్దలవుతోందా?
ట్రెండింగ్
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్‌కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!
-
స్టీరియో స్పీకర్లు, 6 ఏళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 7,900mAh బ్యాటరీతో POCO M8x 5G వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే!
-
Saturday Horoscope: ఆ రాశివారికి చాలా కాలంగా నిలిచిపోయిన పనులను పూర్తి చేస్తారు.. నేటి దినఫలాలు ఇలా.!