CJP: కాక్రోచ్ పార్టీపై కేసు.. రాజస్థాన్ గ్రామస్తుల ఫిర్యాదు..
- జైపూర్‌లో CJP స్కూల్ సందర్శనపై గ్రామస్థులతో ఘర్షణ
- పాఠశాల పరిస్థితిని పరిశీలించేందుకు వెళ్లిన CJP బృందం
- తమపై దాడి చేశారని CJP ఆరోపణ
- CJP బృందం తమను భయపెట్టిందని గ్రామస్థుల ఫిర్యాదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CJP: రాజస్థాన్ ఓ గ్రామంలోని పాఠశాలను సందర్శించేందుకు వెళ్లిన కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) కార్యకర్తలపై గ్రామస్తులు దాడి చేశారు. శుక్రవారం సీజేపీ కో కన్వీనర్ అశుతోష్ రాంకాతో పాటు ఆయనతో ఉన్న వారిపై దాడి జరిగింది. ఈ ఘటనపై రెండు వర్గాలు పరస్పరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాయి. జైపూర్ లోని రాంపూరా కన్వార్పురా గ్రామానికి వెళ్లిన సీజేపీ బృందాన్ని గ్రామస్తులు అడ్డుకున్నారు.తమపై దాడి చేశారని సీజేపీ ఆరోపిస్తోంది.
అయితే, గ్రామస్తులు మాత్రం మరో వాదన వినిపిస్తున్నారు. సీజేపీ బృందం పెద్ద సంఖ్యలో గ్రామంలోకి రావడంతో భయాందోళన వాతావరణం ఏర్పడిందని, తమను బెదిరించారని ఆరోపించారు. ఈ సంఘటనపై శివదాస్‌పురా పోలీస్ స్టేషన్ అధికారి రాజేష్ గౌతమ్ తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం రాత్రి ఓ గ్రామస్తుడు ఫిర్యాదు చేశాడని, సీజేపీ బృందం పెద్ద సంఖ్యలో గ్రామానికి వచ్చి భయపెట్టారని, పిల్లలు కూడా భయపడి పాఠశాలకు హాజరుకావడం లేదని ఫిర్యాదులో పేర్కొన్నట్లు వెల్లడించారు. ఇదే సమయంలో సీజేపీ కూడా తమపై దాడి చేసినట్లు ఫిర్యాదు చేసింది. దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని సీజేపీ డిమాండ్ చేస్తోంది.
Also Read
- Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
- Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
- Supreme Court: సీజేపీ నిరసనలపై సుప్రీంకోర్టు సీరియస్.. ఆదివారం ప్రత్యేక విచారణ..
- Earthquake: ఉత్తరాఖండ్‌లో భూప్రకంపనలు.. ప్రజలు పరుగులు
సీజేపీ నేత అశుతోష్ రాంకా మాట్లాడుతూ.. తమపై దాడి చేసిన వారు బీజేపీ గుండాలని ఆరోపించారు. ఘటనకు సంబంధించిన వీడియోలు, ఇతర ఆధారాలు తమ వద్ద ఉన్నాయని ఆయన అన్నారు. గ్రామానికి చేరుకున్న తర్వాత బీజేపీ కార్యకర్తలతో కలిసి కొందరు గ్రామస్తులు బారికేడ్లు ఏర్పాటు చేసి తమను అడ్డుకున్నారని ఆరోపించారు. ఇదిలా ఉంటే ప్రభుత్వం పాఠశాల భవనం మరమ్మతులకు ఇప్పటికే నిధులు కేటాయించిందని గ్రామస్తులు వెల్లడించారు.
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!