Allu Arjun: అల్లు ఆర్మీకి షాకింగ్ న్యూస్! బన్నీతో సినిమా ఉంటుందా? ఉండదా? సందీప్ బ్రదర్ కామెంట్స్ వైరల్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సెషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్లో సినిమా కోసం అభిమానులు ఎప్పటి నుంచో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ కాంబోలో భారీ ప్రాజెక్ట్‌ను గతంలోనే ప్రకటించడంతో సినిమాపై అంచనాలు కూడా భారీగా ఏర్పడ్డాయి. అయితే తాజాగా ఈ ప్రాజెక్ట్‌పై ఓ అనూహ్యమైన వార్త సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. సందీప్ రెడ్డి వంగా సోదరుడు ప్రణయ్ రెడ్డి వంగా తాజాగా చేసిన కామెంట్స్ ఈ ప్రాజెక్ట్‌పై అనుమానాలను పెంచుతున్నాయి. ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగా ప్రభాస్‌తో ‘స్పిరిట్’ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత ‘యానిమల్’కు సీక్వెల్‌గా ‘యానిమల్ పార్క్’ ఉండనుందని ప్రణయ్ రెడ్డి వంగా వెల్లడించారు. అనంతరం మహేష్ బాబుతో కూడా ఓ సినిమా ఉండే అవకాశం ఉందనే హింట్ ఇచ్చారు. అయితే అల్లు అర్జున్‌తో ప్రకటించిన సినిమా గురించి ప్రశ్నించగా.. ప్రస్తుతం ఆ ప్రాజెక్ట్ ఉంటుందని కచ్చితంగా చెప్పలేనని ఆయన పేర్కొన్నట్లు తెలుస్తోంది. దీంతో బన్నీ – సందీప్ రెడ్డి వంగా ప్రాజెక్ట్ హోల్డ్‌లో పడిందా? అసలు ఈ సినిమా ఉంటుందా లేదా? అనే చర్చ ఇప్పుడు మొదలైంది.
ఒకవేళ ఈ ప్రాజెక్ట్ ముందుకు వెళ్లకపోతే అల్లు అర్జున్ అభిమానులకు నిరాశ తప్పదనే చెప్పాలి. ఎందుకంటే సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో బన్నీని చూడాలని అభిమానులు చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా ‘అర్జున్ రెడ్డి’, ‘కబీర్ సింగ్’, ‘యానిమల్’ వంటి సినిమాలతో సందీప్ రెడ్డి వంగా సొంతంగా క్రియేట్ చేసుకున్న బ్రాండ్ కారణంగా ఈ కాంబినేషన్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ప్రస్తుతం అల్లు అర్జున్.. అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రాకా’ ప్రాజెక్ట్‌తో బిజీగా ఉన్నారు. ఆ తర్వాత లోకేశ్ కనగరాజ్‌తో సినిమా కూడా ప్రకటించారు. అలాగే ఇతర భాషలకు చెందిన పలువురు దర్శకులతోనూ బన్నీ వరుస ప్రాజెక్టులను లైన్లో పెడుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో బన్నీ-సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్ భవిష్యత్తు ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. సందీప్ తన తదుపరి ప్రాజెక్టుల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో.. అల్లు అర్జున్‌తో ప్రకటించిన సినిమా మళ్లీ పట్టాలెక్కుతుందో లేదో తెలియాలంటే మరికొంత కాలం వేచి చూడాల్సిందే.
Also Read
- Sundeep Kishan: ‘సిగ్మా’పై కుట్రల వెనకుండి నడిపిస్తున్నది ఎవరో తెలుసు.. దొరికిపోతే మీకే ఎక్కువ నష్టం
- Mohan Babu: ఆ కష్టాలు నువ్వు పడలేవు నాని.. ఇండస్ట్రీ స్ట్రగుల్‌పై మోహన్ బాబు షాకింగ్ కామెంట్స్!
- Sumalatha: ఫిల్మ్ ఛాంబర్ మీట్.. జానీమాస్టర్ భార్య సుమలత హల్చల్.. వైరల్ అవుతున్న వీడియో!
- Sumalatha: జానీ మాస్టర్ అంటే ఎందుకు అంత భయం? వల్లభనేని అనిల్‌పై సుమలత ఫైర్!
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?