AP High Court: గ్రూప్-1 పరీక్షలపై హైకోర్టు కీలక ఆదేశాలు.. ఆధారాలు, డాక్యుమెంట్లు ఇవ్వాలని ఆదేశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP High Court: గ్రూప్-1 ప్రధాన పరీక్ష జవాబు పత్రాల మూల్యాంకనంలో అక్రమాలు, అవకతవకలు జరిగాయని ఏ ఆధారాలు, డాక్యుమెంట్లు ఆధారంగా ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) నివేదికలు ఇచ్చిందో, ఆ ఆధారాలను, డాక్యుమెంట్లను అప్పీలుదారులకు ఇవ్వాలని హైకోర్టు సోమవారం రిజిస్ట్రార్ (జుడీషియల్)ను ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 24కి వాయిదా వేసింది. ఆ రోజున పూర్తిస్థాయిలో వాదనలు వింటామని తేల్చి చెప్పింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ దొనడి రమేష్, జస్టిస్ అవధానం హరిహరనాథ శర్మ ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.
సిట్ ఏర్పాటుకు ఆదేశాలిచ్చిన ధర్మాసనం
గ్రూప్-1 ప్రధాన పరీక్ష జవాబు పత్రాల మాన్యువల్ మూల్యాకనంలో అక్రమాలు చోటు చేసుకున్నాయన్న కారణంతో పరీక్షను రద్దు చేసి, తాజాగా నిర్వహించాలని హైకోర్టు సింగిల్ జడ్జి 2024 మార్చి 13న ఆదేశాలు జారీ చేశారు. ఈ తీర్పును సవాలు చేస్తూ అటు ఏపీపీఎస్సీ, ఇటు ఇప్పటికే ఉద్యోగాలు పొందిన వారు, పొందని వారు ధర్మాసనం ముందు వేర్వేరుగా అప్పీళ్లు దాఖలు చేశారు. వీటిపై విచారణ జరిపిన ధర్మాసనం, నిజా నిజాలను తేల్చేందుకు సీఐడీ డీజీ నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఏర్పాటు చేసింది. ధర్మాసనం ఆదేశాల మేరకు సిట్ విచారణ జరిపింది. విచారణకు సంబంధించిన ప్రాథమిక, తుది నివేదికలను ఇటీవల ధర్మాసనం ముందుంచిన విషయం తెలిసిందే.
Also Read
- SEC Meeting: ఏపీ మున్సిపల్ ఎన్నికలకు ఆల్ సెట్.. ఎస్ఈసీ కీలక రివ్యూ
- Botsa Satyanarayana : తుఫాన్ నష్టంపై బొత్స డిమాండ్.. చంద్రబాబు సర్కారుపై విమర్శలు!
- Arnab Cyclone Damages : అర్నబ్ తుఫాన్ బీభత్సం.. కొబ్బరి రైతులకు కోలుకోలేని దెబ్బ
- YSRCP: పింఛన్ల పంపిణీపై వైసీపీ ఫిర్యాదు.. ఎన్నికల కోడ్ ఉల్లంఘనలపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి
వాటిని పరిశీలించి సమర్ధవంతమైన వాదనలు వినిపిస్తాం…
సోమవారం ఈ అప్పీళ్లపై జస్టిస్ రమేష్ ధర్మాసనం మరోసారి విచారణ జరిపింది. గ్రూప్-1 పరీక్షలో ఉద్యోగాలు సాధించి, సింగిల్ జడ్జి తీర్పులపై అప్పీళ్లు దాఖలు చేసిన కొందరు అప్పీలుదారుల తరఫున సీనియర్ న్యాయవాది సీవీ మోహన్‌రెడ్డి వాదనలు వినిపించారు. సిట్ దాఖలు చేసిన ప్రాథమిక, తుది నివేదికల మధ్య చాలా తేడాలున్నాయన్నారు. సిట్ వేటి ఆధారంగా అయితే నివేదికలను సమర్పించిందో ఆ ఆధారాలను, డాక్యుమెంట్లను తమకు అందచేసేలా రిజిస్ట్రీని ఆదేశించాలని కోరారు. వాటిని పరిశీలించడం వల్ల సమర్ధవంతమైన వాదనలు వినిపించేందుకు ఆస్కారం ఉంటుందన్నారు. దీంతో ధర్మాసనం, ఆ ఆధారాలను, డాక్యుమెంట్లను అప్పీలుదారులకు ఇవ్వాలని రిజిస్ట్రార్ జుడీషియల్ను ఆదేశించింది.
తాజావార్తలు
-
Arjuna: పవన్ కళ్యాణ్‌తో దిల్ రాజు పాన్-ఇండియా మూవీ.. టైటిల్ ఇదేనట?
-
Hyderabad Traffic Police : డ్రైవింగ్ చేస్తూ సెల్‌ఫోన్ వాడిన 3600 మంది పట్టుకున్న పోలీసులు..
-
Nitesh Tiwari: ఆ ఒక్క ఫైట్ సీన్ కోసమే ఆరున్నరేళ్లు.. ‘రామాయణ’ మూవీపై డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్!
-
Trafficking: ఫెర్టిలిటీ సెంటర్లలో త్వరలోనే తనిఖీలు.. కఠిన చర్యలకు మల్కాజ్గిరి సీపీ హెచ్చరిక..
-
DG Charu Sinha: మహిళల భద్రత ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!