AP Liquor Shops: మద్యం దుకాణాల రెన్యువల్ గడువు పొడిగింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Liquor Shops: ఆంధ్రప్రదేశ్లో 2026–27 సంవత్సరానికి ఏ4 మద్యం దుకాణాల రెన్యువల్ గడువును మరో రెండు రోజుల పాటు పొడిగించారు. మద్యం దుకాణాల యజమానుల విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. దీంతో ఇప్పటికే ఉన్న దుకాణాలను రెన్యువల్ చేసుకునేందుకు ఈ నెల 23వ తేదీ వరకు అదనపు అవకాశం లభించింది. 2026–27 సంవత్సరానికి రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 3,650 ఏ4 మద్యం దుకాణాలను నోటిఫై చేశారు. వీటిలో ఇప్పటివరకు 2,726 మద్యం దుకాణాల రెన్యువల్ పూర్తయింది. మిగిలిన దుకాణాల యజమానులు కూడా గడువులోగా రెన్యువల్ ప్రక్రియ పూర్తి చేసుకునేందుకు ఈ పొడిగింపును ఉపయోగించుకోవచ్చు. మద్యం దుకాణాల రెన్యువల్ ద్వారా ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా రూ.676 కోట్ల ఆదాయం సమకూరినట్లు అధికారులు వెల్లడించారు. గడువు మరో రెండు రోజులు పొడిగించడంతో మిగిలిన దుకాణాల రెన్యువల్ ప్రక్రియ కూడా పూర్తయ్యే అవకాశం ఉంది.
కాగా, ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలోని లిక్కర్ షాపుల లైసెన్స్కు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్న విషయం విదితమే.. 2026-27 ఎక్సైజ్ విధానంలో భాగంగా 3,736 మద్యం దుకాణాల లైసెన్సుల గడువును మరో ఏడాది పాటు పొడిగిస్తూ జీవో జారీ చేశారు.. అయితే, ఈ పొడిగింపు నిర్ణయం అక్టోబర్ 1వ తేదీ నుంచి అమల్లోకి రావాల్సి ఉంది.. కొత్త పాలసీలో భాగంగా ప్రభుత్వం నిఘా వ్యవస్థను కట్టుదిట్టం చేసేలా చర్యలకు పూనుకుంది.. ప్రతి లిక్కర్ షాప్లోనూ తప్పనిసరిగా 4 సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయాలని పేర్కొంది.. నిబంధనల ఉల్లంఘనలను నిశితంగా పరిశీలించేందుకు 24 గంటల పాటు పనిచేసే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారిత పర్యవేక్షణ వ్యవస్థను అమలు చేయనుంది సర్కార్.. అయితే, రెన్యువల్ గడువు ఇవాళ్టితో ముగియగా.. మరో రెండు రోజులు ఆ గడువును పెంచుతూ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం..
Also Read
- AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
- Jana Sena Party: జనసేనలోకి పలువురు వైసీపీ నేతలు, ప్రముఖులు.. పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన పవన్ కల్యాణ్..
- AP Alliance Seat Sharing: సీట్ల సర్దుబాటుపై చర్చలు కొలిక్కి.. కూటమి నుంచి సింగిల్ లిస్ట్.. బొలిశెట్టి కీలక వ్యాఖ్యలు
- Tirumala Laddu Ghee Case: కల్తీ నెయ్యి వ్యవహారంలో కీలక పరిణామం.. భారీగా ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ
తాజావార్తలు
-
CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
-
AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
-
OTR: పవన్ పట్టు.. బాబు వ్యూహం.. ఎవరికి ఎన్ని సీట్లు?
-
Dada: బాలయ్య ఫ్యాన్స్కి గుడ్ న్యూస్… హైదరాబాద్లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
-
Acer Sospiro A70 5G: Acer కొత్త 5G ఫోన్ లాంచ్.. డ్యుయల్ డిస్ప్లేలు, 20GB RAM, 64MP కెమెరా!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..