YS Jagan: డీఎస్సీపై సీబీఐ విచారణ అంటే ఎందుకంత భయం..? చంద్రబాబును ప్రశ్నించిన జగన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YS Jagan: ఆంధ్రప్రదేశ్‌లో డీఎస్పీపై వివాదం కొనసాగుతూనే ఉంది.. రోజుకో ఆరోపణ.. పూటకో విమర్శ అన్నట్టు ముందుకు సాగుతూనే ఉంది.. ఈ వ్యవహారంపై సోషల్ మీడియ వేదికగా మరోసారి హాట్ కామెంట్లు చేశారు వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. డీఎస్సీ-2025 నియామకాల్లో అవకతవకలు జరిగాయంటూ సీబీఐ విచారణ కోరుతున్న వైఎస్ జగన్.. ముఖ్యమంత్రి చంద్రబాబుపై మరోసారి ప్రశ్నలు సంధించారు. డీఎస్సీపై సీబీఐ విచారణ కోరితే ప్రభుత్వం ఎందుకు వెనుకాడుతోందని ప్రశ్నించారు. నియామకాలు పారదర్శకంగా జరిగాయంటూ చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ తమకు తామే ధ్రువీకరణ ఇచ్చుకుంటే దానికి విలువ ఏముంటుందని జగన్ వ్యాఖ్యానించారు.
విజయవాడలో సోమవారం జరిగిన పరిణామాలను ప్రస్తావిస్తూ.. శాంతియుతంగా సీబీఐ విచారణ కోరుతూ ర్యాలీ నిర్వహించేందుకు వెళ్తున్న వారిని పోలీసులు అడ్డుకున్నారని జగన్ ఆరోపించారు. లాఠీచార్జ్ చేయించారని, టీచర్ల ముసుగులో వచ్చిన కొందరితో దాడులు చేయించారని ఆయన ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలకు ర్యాలీలు నిర్వహించే హక్కు కూడా లేదా అని చంద్రబాబును ప్రశ్నించారు. కాగా, పోలీసుల వాదన ప్రకారం విజయవాడలో అమలులో ఉన్న ఆంక్షలు, ట్రాఫిక్ పరిస్థితుల నేపథ్యంలో నిరసనకు అనుమతి ఇవ్వలేదని అధికారులు తెలిపారు. డీఎస్సీ నియామకాల్లో అక్రమాలు జరిగాయనే ఆరోపణలపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని జగన్ డిమాండ్ చేశారు. ఎలాంటి తప్పూ జరగలేదన్న నమ్మకం ప్రభుత్వానికి ఉంటే సీబీఐ విచారణకు ఎందుకు వెనుకాడుతోందని ప్రశ్నించారు. లక్షలాది మంది అభ్యర్థుల భవిష్యత్తుతో ముడిపడిన టీచర్ ఉద్యోగాల నియామకాల్లో పారదర్శకత, ప్రతిభకు న్యాయం జరిగేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.
Also Read
- AP Cabinet Decisions: బీసీ రిజర్వేషన్లపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ సీట్ల వివరాలు..
- AP BC Reservations: స్థానిక సంస్థల్లో బీసీలకు 28.1 శాతం.. పార్టీ పరంగా మరో 6 శాతం
- BC Reservations: బీసీ రిజర్వేషన్లపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. రేపు పూర్తి జాబితా
- AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ.. పవన్ కల్యాణ్ సహా జనసేన మంత్రుల డుమ్మా..
డీఎస్సీ నియామకాలపై వైఎస్సార్సీపీ గత కొంతకాలంగా సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తోంది. ముఖ్యంగా స్పోర్ట్స్ కోటా నియామకాల్లో అక్రమాలు జరిగాయని ఆ పార్టీ ఆరోపిస్తోంది. ప్రభుత్వం మాత్రం నియామక ప్రక్రియ నిబంధనల ప్రకారమే జరిగిందని చెబుతోంది. ఈ అంశంపై ఇరుపక్షాల మధ్య రాజకీయ విమర్శలు కొనసాగుతున్నాయి. డీఎస్సీ వ్యవహారంలో పోలీసులను అడ్డుపెట్టుకుని సమస్యను పక్కదారి పట్టించలేరని జగన్ వ్యాఖ్యానించారు. ప్రతిపక్ష గొంతును అణచివేయడం ద్వారా వాస్తవాలు బయటకు రాకుండా చేయలేరన్నారు. సీబీఐ ఆధ్వర్యంలో నిష్పాక్షిక విచారణ జరిగితేనే అభ్యర్థుల్లో కోల్పోయిన నమ్మకాన్ని తిరిగి తీసుకురాగలమని పేర్కొన్నారు. డీఎస్సీ అభ్యర్థులకు న్యాయం జరగాలని, ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలు పారదర్శకంగా ఉండాలని జగన్ అన్నారు. డీఎస్సీ నియామకాల్లో జరిగిన అక్రమాలకు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని, సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. డీఎస్సీ బాధితుల పక్షాన తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్..
.@ncbn గారూ… డీఎస్సీ స్కాంపై సీబీఐ విచారణ వేయాలని అడిగితే, ఎందుకంత భయం? ఎందుకంత ఉక్రోషం? పారదర్శకంగా జరిగాయంటూ మీరు, మీ కొడుకు, ప్రస్తుత విద్యాశాఖ మంత్రి లోకేష్, మీకు మీరుగానే సర్టిఫికెట్ ఇచ్చుకుంటారా? స్కాంలు చేసిన వాళ్లే తమకు తాముగా ఇచ్చుకునే సర్టిఫికెట్లకు విలువ ఏముంటుంది?… pic.twitter.com/oOWsewQMA3
— YS Jagan Mohan Reddy (@ysjagan) September 21, 2026
తాజావార్తలు
-
Jai Jasti-Medha Meka: టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న ‘ఆమె’ కూతురు.. రొమాంటిక్ పోస్టర్ వచ్చేసింది!
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
-
IAS Officers: ఏపీలో 11 మంది ఐఏఎస్ అధికారులకు పోస్టింగ్‌లు..
-
CJI Suryakant: సుప్రీంకోర్టు తలుపులు తెరిచే ఉంటాయి.. విపక్ష నేతలకు అపాయింట్మెంట్ నిరాకరణపై సీజేఐ క్లారిటీ
-
RTC-Metro Pass: ప్రయాణికులకు అలర్ట్.. ఆర్టీసీ -మెట్రో కామన్ పాస్ ధరలు తగ్గింపు..!
ట్రెండింగ్
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!