రెబల్ స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. వాటిలో మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న‘ది రాజా సాబ్’ ఒకటి. హార్రర్, కామెడీ, రొమాంటిక్ కథాంశంతో రానున్న ఈ సినిమాలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిధిలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ విలన్‌గా నటిస్తున్నారు. ఈ చిత్రం నుంచి విడుదల అయిన పోస్టర్స్, గ్లింప్స్ సినిమాపై భారీ అంచనాలను పెంచేసాయి. ఈ సినిమాలో వింటేజ్ ప్రభాస్ ను చూస్తారని ఫ్యాన్స్
ఇటీవల ఈ సినిమా నుండి ఎటువంటి అప్డేట్ లేకపోవడంతో ఫ్యాన్స్ నిరుత్సహంలో ఉన్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం రాజాసాబ్ షూటింగ్ ఆల్మోస్ట్ ఫినిష్ అయింది. ఓ పది లేదా పదిహేను రోజుల ప్యాచ్ వర్క్ పెండింగ్ లో ఉందని తెలిసింది. ప్రభాస్ ప్రస్తుతం యూరప్ లో ఉన్నడని తిరిగి హైదరాబాద్ వచ్చాక షూట్ చేస్తారట. దీంతో పాటుగా సాంగ్స్ కూడా పెండింగ్ ఉన్నాయట. త్వరలో జరగాయబోయే షెడ్యూల్ వాటిని కూడా ఫినిష్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. కానీ ఈ సినిమాలో విఎఫెక్స్ పోర్షన్ ఎక్కువ ఉంటుందని సాంగ్స్ షూట్ చేసాక వాటి వర్క్ కు మరింత టైమ్ పడుతుందని ముందుగా ప్రకటించిన ఏప్రిల్ 10న రిలీజ్ అనేది దాదాపు లేనట్టేనని తెలిపాయి. ఇప్పటికే ఆ డేట్ కు సన్నీడియోల్ జాట్, అజిత్ కుమార్ గుడ్ బాడ్ అగ్లీ, సిద్దు జొన్నలగడ్డ జాక్ రిలీజ్ డేట్ వేసాయి. ఏప్రిల్ లో వాయిదా పడిన రాజాసాబ్ జూన్ లో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.