AP Cabinet Decisions: సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.. సమావేశం ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడిన మంత్రి కొలుసు పార్థసారథి.. కేబినెట్ నిర్ణయాలను వెల్లడించారు.. రాష్ట్ర భవిష్యత్తుకు పునాది వేసే విధంగా ఇవాళ కేబినెట్లో నిర్ణయం జరిగిందన్నారు.. సుమారు 80 వేల కోట్ల ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపింది.. దీని ద్వారా లక్షకు పైగా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందన్నారు.. పారిశ్రామిక వేత్తలకు డెస్టినేషన్ ఏపీ అయ్యే విధంగా ఆమోదం జరిగింది.. ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రానిక్స్ కంపోనెట్ పాలసీకి కేబినెట్ ఆమోదం తెలిపింది.. ఇప్పటి వరకు అన్ని కంపోనెంట్లు పూర్తిగా మన దగ్గర తయారయ్యే పరిస్థితి లేదు.. ఎలక్ట్రానిక్ పాలసీ వల్ల ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీ అభివృద్ధి చెందుతుంది.. ఈ పాలసీ వల్ల తమిళనాడు, గుజరాత్ లో అభివృద్ధి జరిగిందని వెల్లడించారు..
Read Also: Peddapuram: పెద్దాపురంలో చీకటి బాగోతం.. మహిళ ఆవేదన వింటే చలించిపోతారంతే..!
రాష్ట్రంలో సీఫీ.. గూగుల్ డేటా సెంటర్లు ఏర్పాటు చేస్తున్నారు… డేటా సెంటర్ల వల్ల 16 వేల కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది అన్నారు పార్థసారథి.. వైజాగ్ ను రాబోయే రోజుల్లో ఐటీ హబ్ గా చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు.. ఆంధ్రప్రదేశ్ లో చాలా ప్రాంతాల్లో అక్రమ లే ఔట్లు ఉన్నాయి.. అనేక లోపల వల్ల ఇళ్ల నిర్మాణం చేయలేకపోతున్నారు.. ఎల్ఆర్ఎస్ ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపిందని పేర్కొన్నారు.. ఇక, ప్రపంచంలో పెద్ద సంస్థలు సింగపూర్ నుంచే పని చేస్తున్నాయి.. సింగపూర్ నుంచి పెద్ద ఎత్తున పెట్టుబడులు ఆహ్వానించాడానికి సీఎం చంద్రబాబు సింగపూర్ వెళ్తున్నారని వెల్లడించారు.. సీఎం సింగపూర్ ట్రిప్ విజయవంతం అవ్వాలని మేం కూడా కోరుకుంటున్నామన్నారు మంత్రి కొలుసు పార్థసారథి..