కొత్తగా ఏర్పడిన జిల్లాల్లో కలెక్టరేట్లు, రెవెన్యూ డివిజన్ కార్యాలయాలు, అవసరమైన చోట తహసీల్దారు కార్యాలయాలను నిర్మిస్తాం అని తెలిపారు రెవెన్యూ, రిజిస్ర్టేషన్ అండ్ స్టాంప్స్ శాఖా మంత్రి అనగాని సత్యప్రసాద్.. ఈ రోజు శాసనసభలో ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ల నిర్మాణంపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చిన ఆయన.. కొత్త జిల్లాల్లో కలెక్టరేట్లు, రెవెన్యూ డివిజన్ ఆఫీసులు, అవసరమైన చోట తహసీల్దార్ కార్యాలయాలను నిర్మిస్తాం అన్నారు..