Kolusu Parthasarathy: భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు కౌంట్‌డౌన్.. ఉత్తరాంధ్రపై పార్థసారథి కీలక వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kolusu Parthasarathy: భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభానికి కౌంట్‌డౌన్ మొదలైందని మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. ఉత్తరాంధ్ర ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఈ ప్రాజెక్టు త్వరలో ప్రారంభం కానుండటం ప్రాంత అభివృద్ధికి కీలక మలుపు అవుతుందని అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం తిరుపతి నుంచి ఇచ్చాపురం వరకు, మధ్యలో అమరావతి సహా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను సమాన దృష్టితో అభివృద్ధి చేస్తున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రాన్ని సమగ్ర అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు.
ఒకప్పుడు ఉత్తరాంధ్ర వలసలకు చిరునామాగా ఉండేదని, ప్రస్తుతం దేశీయ, అంతర్జాతీయ కార్పొరేట్ సంస్థలకు విశాఖపట్నం, ఉత్తరాంధ్ర ప్రాంతం పెట్టుబడుల గమ్యస్థానంగా మారుతోందని అన్నారు పార్థసారథి… కూటమి ప్రభుత్వ హయాంలో ఈ మార్పు సాధించడం గర్వకారణమని వ్యాఖ్యానించారు. గత ఐదేళ్ల వైసీపీ పాలనపై కూడా ఆయన విమర్శలు చేశారు. ఉత్తరాంధ్రను అభివృద్ధి కోణంలో కాకుండా కేవలం రియల్ ఎస్టేట్ కోణంలో మాత్రమే చూసిందని ఆరోపించారు. రెవెన్యూ, భూ వివాదాల పరిష్కారంపై దృష్టి పెట్టకుండా వేల ఎకరాల భూములను స్వాధీనం చేసుకునే ప్రయత్నాలు జరిగాయని అన్నారు.
Also Read
- Kakumanu Rajasekhar Death: వైసీపీలో విషాదం.. కాకుమాను రాజశేఖర్ ఆకస్మిక మృతి.. వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
- CM CBN Reviews on Heavy Rains: వర్షాలపై సీఎం చంద్రబాబు మరోసారి సమీక్ష.. కలెక్టర్లకు కీలక ఆదేశాలు
- AP Heavy Rains: వర్ష బీభత్సం.. విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం.. కొన్ని రద్దు, మరికొన్ని దారి మళ్లింపు
- Flash Flood Alerts: ఏపీ, తెలంగాణలో ఫ్లాష్ ఫ్లడ్ హెచ్చరికలు.. ఈ జిల్లాలకు ముప్పు..!
జీవో 596ను తీసుకొచ్చి ప్రజలను మోసం చేశారని, ఆ జీవో రాకముందే 20 నుంచి 25 వేల ఎకరాల భూమిని సేకరించేందుకు ప్రయత్నించారని ఆరోపించారు పార్థసారథి.. మూడు రాజధానుల పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టించారని, కానీ ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో ఆశించిన స్థాయిలో అభివృద్ధి చేయలేదని విమర్శించారు. 2014–19 మధ్య విశాఖలో ఐటీ హిల్స్ అభివృద్ధి జరిగిందని, అప్పట్లో వచ్చిన కంపెనీలను కూడా గత ప్రభుత్వం బెదిరించి వెళ్లిపోయే పరిస్థితి తీసుకొచ్చిందని మంత్రి పేర్కొన్నారు. చంద్రబాబు సీఎం అయిన తర్వాత ఉత్తరాంధ్రపై ఉన్న వెనుకబడిన జిల్లాల ముద్రను తొలగించేందుకు కృషి చేశారని చెప్పారు. వైసీపీ ప్రభుత్వం విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా ప్రకటించినప్పటికీ, కనీస మౌలిక వసతుల కల్పనకు రూ.500 కోట్ల నుంచి రూ.1,000 కోట్ల వరకు కూడా ఖర్చు చేయలేదని, ఆ దిశగా ప్రయత్నాలు కూడా చేయలేదని మంత్రి కొలుసు పార్థసారథి ఆరోపించారు.
తాజావార్తలు
-
Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
-
OTR: రిజర్వేషన్స్ మారిపోయినా పట్టు తగ్గకుండా సీనియర్స్ జాగ్రత్తలు..
-
Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
-
Traffic: ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. తెలంగాణలో కొత్త విధివిధానాలు అమల్లోకి..
-
బాక్సాఫీస్ వద్ద నాని ఊచకోత.. ‘The Paradise’ ప్రీమియర్స్‌తో సరికొత్త హిస్టరీ! కలెక్షన్స్ ఎంతంటే?
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!