Flash Flood Alerts: ఏపీ, తెలంగాణలో ఫ్లాష్ ఫ్లడ్ హెచ్చరికలు.. ఈ జిల్లాలకు ముప్పు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Flash Flood Alerts: తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఏపీలో అనకాపల్లి, విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, పార్వతీపురం మన్యం జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్ హెచ్చరికలు జారీ చేశారు. ఇక, తెలంగాణలోని ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోనూ ఆకస్మిక వరదల ముప్పు ఉన్నట్లు అధికారులు అప్రమత్తం చేశారు.
కళింగపట్నం సమీపంలో తీరం దాటిన తీవ్ర వాయుగుండం
తీవ్ర వాయుగుండం రాత్రి 11 గంటల నుంచి తెల్లవారుజామున 1 గంట మధ్య కళింగపట్నం సమీపంలో తీరం దాటినట్లు అధికారులు తెలిపారు. గడిచిన ఆరు గంటల్లో గంటకు సుమారు 3 కిలోమీటర్ల వేగంతో కదిలిన ఈ వ్యవస్థ మరో 12 గంటల పాటు తీవ్ర వాయుగుండంగా కొనసాగనుంది. ఆ తర్వాతి 24 గంటల్లో క్రమంగా బలహీనపడే అవకాశం ఉందని వెల్లడించారు. తీరం దాటినప్పటికీ మరో 48 గంటల పాటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ సంస్థ సూచించింది. నేడు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. పోలవరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లోనూ కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
Also Read
80 ప్రాంతాల్లో 100 మిల్లీమీటర్లకు పైగా వర్షపాతం
గడిచిన 24 గంటల్లో పలు ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు నమోదయ్యాయి. సుమారు 80 ప్రాంతాల్లో 100 మిల్లీమీటర్లకు పైగా వర్షపాతం రికార్డయింది. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు ఆకస్మిక వరదల పట్ల అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. క్షేత్రస్థాయిలో అధికార యంత్రాంగం హైఅలర్ట్లో ఉండాలని విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ ఆదేశించారు.
ఎన్టీఆర్ జిల్లాలో కట్టలేరు వాగు ఉధృతి
తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గంపలగూడెం మండలం వినగడప–తోటమూల మధ్య కట్టలేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో సుమారు 20 గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. చింతలపాడు ప్రాంతంలో బలమైన ఈదురుగాలులకు 74 విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. దీంతో గ్రామం నిన్నటి నుంచి విద్యుత్ సరఫరా లేక చీకటిలో ఉంది. మరోవైపు రెవెన్యూ శాఖ నిర్వహించిన ప్రాథమిక అంచనాల్లో 40 ఇళ్లు పాక్షికంగా, మరో 10 ఇళ్లు పూర్తిగా దెబ్బతిన్నట్లు గుర్తించారు.
విజయనగరంలో నీటమునిగిన పంట పొలాలు
విజయనగరం జిల్లాలో గజపతినగరం, మెంటాడ, బొండపల్లి, గంట్యాడ మండలాల్లో అర్ధరాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. మెంటాడ, దత్తిరాజేరు మండలాల్లోని పత్తి పొలాల్లో భారీగా వర్షపు నీరు నిలిచిపోయింది. గజపతినగరం మండలం తమ్మిరాయుడుపేటలో వరి, పత్తి పంటలు నీటమునిగాయి. అటు, అల్లూరి సీతారామరాజు జిల్లా జీకే వీధి ప్రాంతంలో భారీ వర్షాలకు ధారకొండ మండలంలోని గంగవరం రహదారి కొంతమేర కొట్టుకుపోయింది. దీంతో పలు గ్రామాలకు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రహదారి పరిస్థితిని అధికారులు పరిశీలిస్తూ సహాయక చర్యలు చేపడుతున్నారు.
విశాఖలో 24 గంటల్లో 24 సెంటీమీటర్ల వర్షం
అతి భారీ వర్షాలు విశాఖపట్నంపై తీవ్ర ప్రభావం చూపాయి. 24 గంటల వ్యవధిలో నగరంలో 24 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. భారీ వర్షాల కారణంగా పలు రహదారులు దెబ్బతిన్నాయి. బీచ్ రోడ్ కొంతమేర కోతకు గురై, కొన్ని చోట్ల రహదారులు కుంగిపోవడంతో గుంతలు ఏర్పడ్డాయి. కామత్ జంక్షన్ వద్ద ఓ కారు నీటిలో కూరుకుపోయింది. తీవ్ర వాయుగుండం ప్రస్తుతం ఉత్తరాంధ్రపై కేంద్రీకృతమై ప్రభావం చూపుతున్న నేపథ్యంలో ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికారులు సూచిస్తున్నారు. సాయంత్రానికి వ్యవస్థ ఉత్తర వాయవ్య దిశగా పయనిస్తూ తీవ్రత తగ్గి వాయుగుండంగా మారే అవకాశం ఉన్నప్పటికీ, మరో 48 గంటలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!