CM Chandrababu: అమరావతికి అంతరాయం లేని విద్యుత్ సరఫరా.. నేడు జీఐఎస్‌ను ప్రారంభించనున్న సీఎం
- అమరావతిలో అంతరాయం లేని నాణ్యమైన విద్యుత్..
- నేడు 400/220 కేవీ గ్యాస్ ఇన్సు లేటెడ్ సబ్ స్టేషన్ (జీఐఎస్) ప్రారంభం..
- నేడు ఐదు సబ్స్టేషన్ల ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు..
- మరో 14 సబ్స్టేషన్లకు శంకుస్థాపన చేయనున్న ఏపీ సీఎం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu: కూటమి ప్రభుత్వం అమరావతి రాజధాని పునర్నిర్మాణంపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది.. గత ప్రభుత్వ హయాంలో నిలిచిపోయిన నిర్మాణాలను కూటమి సర్కార్ ఏర్పడిన తర్వాత ప్రత్యక్షంగా వెళ్లి పరిశీలించారు సీఎం చంద్రబాబు నాయుడు.. ఇక, నిపుణులను కూడా రంగంలోకి దింపడం.. వాళ్లు పరిశీలించి ప్రభుత్వానికి నివేదికలు ఇవ్వడం.. ఆ తర్వాత పనులు పునర్ ప్రారంభం అన్ని జరిగిపోయాయి.. ఇక, అమరావతిలో అంతరాయం లేని నాణ్యమైన విద్యుత్ సరఫరా కోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది.. దీనికోసం నిర్మించిన 400/220కేవీ గ్యాస్ ఇన్సు లేటెడ్ సబ్ స్టేషన్ (జీఐఎస్) ఈ రోజు ప్రారంభించనున్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..
Read Also: IT Raids: మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ఇంటిపై ఐటీ దాడులు.. అర్ధరాత్రి వరకు సోదాలు..
Also Read
- AP High Court: స్థానిక ఎన్నికలపై హైకోర్టు కీలక ఆదేశాలు..
- TDP Candidates 1st List: మున్సిపల్ ఎన్నికలకు టీడీపీ తొలి జాబితా.. 61 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు చోటు
- YSRCP 2nd Candidates List: ఏపీ స్థానిక ఎన్నికలు.. రెండో విడత అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ.. అభ్యర్థులు వీరే!
- AP Government Employees Holiday: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. వరుసగా 4 రోజుల సెలవులు.. ఉత్తర్వులు జారీ
రాష్ట్రంలో తొలిసారిగా తాళ్లాయపాలెంలో ట్రాన్స్ మిషన్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లిమిటెడ్ ద్వారా 220/440 కేవీ ఏర్పాటు చేశారు.. ఇప్పటి వరకు 220/132/33 కేవీ తాడికొండ కేంద్రం నుంచి విద్యుత్తు సరఫరా అవుతుండగా.. తాళ్లాయపాలెం వద్ద నిర్మించిన 400/220 కేవీ విద్యుత్తు కేంద్రం పక్కనే 220/33 కేవీ విద్యుత్తు కేంద్రాన్ని నిర్మించాలని నిర్ణయం తీసుకున్నారు.. ఇక్కడి నుంచి నేలపాడులో నిర్మించే 220/33 కేవీ విద్యుత్తు కేంద్రానికి సరఫరా చేస్తారు. తాడేపల్లిలోని 132 కేవీ కేంద్రాన్ని 220 కేవీగా అప్‌గ్రేడ్ చేసి తాళ్లాయపాలెం జీఐఎస్ నుంచి సరఫరా తీసుకుంటారు.. తాళ్లాయపాలెం జీఐఎస్ కేంద్రం నుంచి రాజధాని అమరావతిలో నిర్మించబోయే 220/33 కేవీ విద్యుత్తు ఉపకేంద్రాలకు విద్యుత్ సరఫరా చేయనున్నారు.. మొత్తంగా అంతరాయం లేకుండా రాజధాని అమరావతికి నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయడం లక్ష్యంగా పెట్టుకుంది ప్రభుత్వం..
Read Also: Telangana Temperature: తెలంగాణను వణికిస్తున్న చలి.. పడిపోతున్న ఉష్ణోగ్రతలు..
అయితే, ఈ రోజు మొత్తంగా ఐదు సబ్స్టేషన్ల ప్రారంభించనున్నారు సీఎం చంద్రబాబు.. ఇదే సమయంలో మరో 14 సబ్స్టేషన్లకు శంకుస్థాపన చేయనున్నారు.. ఈ సబ్స్టేషన్లు ప్రధానంగా పరిశ్రమలు, ఆక్వాకల్చర్ మరియు వ్యవసాయ రంగాలు మరియు గృహాలకు మెరుగైన నాణ్యమైన విద్యుత్‌ను అందించగలవని అధికారి చెబుతున్నారు.. గుంటూరు జిల్లా తాళ్లాయపాలెంలో 400/220 కేవీ గ్యాస్ ఇన్సులేటెడ్ సబ్‌స్టేషన్ (జీఐఎస్) భౌతికంగా ప్రారంభించనున్న సీఎం.. మరో నాలుగు సబ్స్టేషన్లను ప్రారంభించి, మరో 14 వాటికి శంకుస్థాపన చేస్తారు.
తాజావార్తలు
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!
-
Team India: ఐదు వన్డేలు, ఇద్దరు కెప్టెన్లు.. ఆకాష్ దీప్ రీఎంట్రీ.. జస్ప్రీత్ బుమ్రాపై బీసీసీఐ కీలక నిర్ణయం!
-
Kavya Maran – Anirudh Ravichander పెళ్లి ఫిక్స్.! గ్రీస్‌లో పెళ్లి, చెన్నైలో గ్రాండ్ రిసెప్షన్.?
-
Yoo Ji-won: ఫినిషింగ్ లైన్‌కు 500 మీటర్ల దూరంలో కుప్పకూలిన రన్నింగ్ ఇన్ఫ్లుయెన్సర్.. 25 ఏళ్లకే మృతి..!
-
Retired GST Commissioner Kidnap Case: విశాఖలో రిటైర్డ్ జీఎస్టీ కమిషనర్ కిడ్నాప్ కలకలం..
ట్రెండింగ్
-
Test Twenty Cricket: క్రికెట్లో సరికొత్త ప్రయోగం.. అమ్మాయిలు, అబ్బాయిలతో 80 ఓవర్ల సరికొత్త ‘టెస్ట్ ట్వంటీ’ టోర్నీకి శ్రీకారం..!
-
Saturday Horoscope: ఆ రాశుల వారికి ఆర్థిక లాభాలు.. కానీ ఆ రాశి వారు మాత్రం జాగ్రత్త సుమీ..!
-
International Day for the Eradication of Poverty: పేదరికం అంటే ఆకలి మాత్రమే కాదు.. కొత్త సవాళ్లివే.!
-
Stain Removal Tips : నవరాత్రి వేళ తెల్లటి బట్టలపై కుంకుమ, మొండి మరకలా? ఈ చిట్కాలతో మాయం.!
-
Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!