CM Chandrababu: శాంతిభద్రతలపై సీఎం కీలక సమీక్ష.. సైబర్ వార్ రూమ్ ఏర్పాటు చేయాలని ఆదేశాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu: అమరావతిలో నిర్వహించిన జిల్లా కలెక్టర్లు, ఎస్పీల సదస్సులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు రాష్ట్ర శాంతిభద్రతల పరిస్థితిపై సమీక్ష నిర్వహించారు. నేరాల నియంత్రణ, రోడ్డు ప్రమాదాలు, సైబర్ నేరాలు, ఆర్థిక మోసాల నివారణ వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు. అయితే, ఈ సమావేశంలో రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా గతేడాదితో పోలిస్తే రాష్ట్రంలో నేరాల శాతం తగ్గినట్లు వివరించారు.
డీజీపీ తెలిపిన వివరాల ప్రకారం:
* మహిళలపై నేరాలు 7 శాతం తగ్గాయి
* చోరీలు 8 శాతం తగ్గాయి
* ఆర్థిక నేరాలు 0.3 శాతం తగ్గాయి
* ఎస్సీ, ఎస్టీలపై నేరాలు 30 శాతం తగ్గాయి
* సైబర్ నేరాల్లో బాధితులు మొత్తం రూ.652 కోట్లు కోల్పోయారని, అందులో రూ.116 కోట్లు ఫ్రీజ్ చేయగలిగామని డీజీపీ వెల్లడించారు.
Also Read
- Viveka Murder Case: వివేకా కేసులో సునీల్ యాదవ్ సంచలన వాంగ్మూలం..!
- Minister Atchannaidu: తుఫాన్ ఎఫెక్ట్.. అధికారులకు మంత్రి అచ్చెన్నాయుడు కీలక ఆదేశాలు
- CM Chandrababu Foreign Trip: ఫ్యామిలీతో సీఎం చంద్రబాబు విదేశీ టూర్.. 3 రోజుల వ్యక్తిగత పర్యటన..
- CM Chandrababu: కరవు సీమ నుంచి కలల సాకారం వైపు.. సీఎం కీలక వ్యాఖ్యలు
సైబర్ నేరాలపై మరింత అప్రమత్తత అవసరం
సైబర్, ఆర్థిక నేరాలను అరికట్టడంలో మరింత చురుకుగా వ్యవహరించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ప్రజల్లో అవగాహన పెంచడం అత్యంత అవసరమని సూచించారు. సైబర్ నేరాలను సమర్థంగా నియంత్రించేందుకు ప్రత్యేక సైబర్ ఫోర్స్‌తో “సైబర్ వార్ రూమ్” ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
రోడ్డు ప్రమాదాల నివారణపై ఫోకస్
రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. ప్రమాదాలు ఎక్కువగా జరిగే బ్లాక్ స్పాట్ల వద్ద ఇతర శాఖలతో సమన్వయం చేసుకుని ఫలితాలు చూపించాలని అధికారులకు చెప్పారు.
కన్విక్షన్ రేటు పెంపుపై దృష్టి
2025లో రాష్ట్రంలో కన్విక్షన్ రేటు 44 శాతంగా ఉండగా, 2026లో అది 49.8 శాతానికి పెరిగినట్లు డీజీపీ వివరించారు. అయితే దీన్ని 70 శాతానికి తీసుకెళ్లాలనే లక్ష్యాన్ని సీఎం నిర్దేశించారు. టెక్నాలజీని వినియోగించి ఆధారాలు సేకరించడం, వేగవంతమైన దర్యాప్తు ద్వారా నిందితులకు త్వరగా శిక్ష పడేలా చూడాలని సూచించారు. ఇక “ఇన్ విజిబుల్ పోలీస్ కాదు.. విజిబుల్ పోలీసింగ్ చేసి చూపించాలి” అని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. పోలీసుల చర్యలు చూసి నేరం చేయాలంటేనే భయపడే పరిస్థితి రావాలని అన్నారు. చోరీ కేసుల్లో ఫిర్యాదు వచ్చిన 24 గంటల్లోనే నిందితులను పట్టుకునేలా చర్యలు ఉండాలని సూచించారు.
ఎర్రచందనం అక్రమ రవాణాపై డీజీపీ వివరాలు
గత ఏడాదిలో 50 వేల కిలోల ఎర్రచందనం స్వాధీనం చేసుకున్నామని డీజీపీ తెలిపారు. ఈ కేసుల్లో 302 కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. ఎర్రచందనం స్మగ్లింగ్ కేసుల్లో 91 శాతం కన్విక్షన్ రేటు నమోదైందని చెప్పారు. పోలీసింగ్‌లో సాంకేతికత వినియోగాన్ని పెంచుతున్నామని డీజీపీ తెలిపారు. గత ఏడాదిలో డ్రోన్ల ద్వారా లక్ష గంటలపాటు సర్విలెన్స్ నిర్వహించామని చెప్పారు. సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్లలో కూడా డ్రోన్ల వినియోగాన్ని పెంచినట్లు వెల్లడించారు.
జిల్లా ఎస్పీల ప్రజెంటేషన్లు
సమావేశంలో పలువురు జిల్లా ఎస్పీలు తమ జిల్లాల్లో అమలు చేస్తున్న విధానాలను వివరించారు. ముఖ్యంగా కుల వివాదాల నివారణ, రోడ్డు ప్రమాదాల నియంత్రణ, ప్రజా భద్రత అంశాల్లో చేపట్టిన చర్యలను వివరించారు.
తాజావార్తలు
-
Iran Ceasefire Proposal: ఇరాన్ శాంతి ప్రతిపాదనకు ట్రంప్ నో.. 7 రోజుల కాల్పుల విరమణ ప్లాన్ తిరస్కరణ
-
Shubman Gill Injury: సిరాజ్ దెబ్బకు శుభ్‌మన్ గిల్ విలవిలా.. నెట్స్ లో గాయపడ్డ టీమిండియా కెప్టెన్.!
-
Vikarabad: గణేష్ నిమజ్జనంలో కలకలం.. పోలీస్ కానిస్టేబుల్‌పై కత్తితో దాడి..!
-
iQOO 16: iQOO 16 లాంచ్ డేట్ ఫిక్స్.. 50MP కెమెరా, 8,400mAh బ్యాటరీ, 165Hz డిస్ప్లే!
-
Oman Cricket: ఇదేం విచిత్రం రా మావా..! టీమ్‌లో తొమ్మిది మంది ఒకే కుటుంబానికి చెందిన ప్లేయర్స్..
ట్రెండింగ్
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!