తాను చెప్పిన మాటలను 30 ఏళ్ల తర్వాత తెలంగాణ అసెంబ్లీలో గుర్తు చెయ్యడం సంతోషం అన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. గతంలో ఏ ఇజం లేదు టూరిజం ఒక్కటే అని తాను మాట్లాడితే తీవ్ర విమర్శలు చేశారన్నారు.. కలెక్టర్ల సమావేశంలో ఈ అంశాన్నే ప్రస్తావించారు సీఎం.. టూరిజంపై కలెక్టర్లు ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు..
వచ్చే ఏడాది నాటికి 15 శాతం వృద్ది సాధనే లక్ష్యంగా రేపటి నుంచి రెండు రోజుల పాటు కలెక్టర్ల సదస్సు నిర్వహించనుంది ఏపీ ప్రభుత్వం.. సచివాలయంలోని కాన్ఫరెన్స్ హాల్ లో ఈ సదస్సు జరగనుంది.. గతానికి భిన్నంగా కలెక్టర్ల సదస్సు నిర్వహించడానికి సర్కార్ సిద్ధమైంది.. వచ్చే వేసవి కాలంలో తాగునీటి సమస్య, పశుగ్రాసం, పశువులకు తాగునీటి లభ్యత, సీజనల్ వ్యాధుల నివారణ, ఉపాధి హామీ పధకం పనులు వంటి అంశాలు ప్రధానంగా చర్చకు రానున్నాయి. పి.ఫోర్ కార్యక్రమంపై…
ఆంధ్రప్రదేశ్‌లో అనర్హులు కూడా పెన్షన్లు అందుకుంటున్నట్టు స్పష్టం అవుతోంది.. ప్రతీ 10 వేల మందిలో ఏకంగా దాదాపు ఐదు వందల మంది అనర్హులే పెన్షన్లు తీసుకుంటున్నట్టు గుర్తించారు.. రెండో రోజు కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణపేదరిక నిర్మూలన శాఖలపై ప్రజెంటేషన్ ఇచ్చారు ఆ శాఖ ముఖ్యకార్యదర్శి శశిభూషణ్ కుమార్.. పెన్షన్ లు అర్హత లేనివారికి వస్తున్నాయనే ఫిర్యాదులు ఉన్నాయని వెల్లడించిన ఆయన.. తాము నిర్వహించిన సర్వేలో ప్రతీ పదివేలకూ 500 మంది వరకూ అనర్హులని తేలినట్టు…
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది.. పౌర సేవల్లో ప్రజలకు ఇబ్బందులు లేకుండా.. వారికి అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా.. వాట్సాప్ ద్వారానే ఏకంగా 153 సేవలను అందించేందుకు సిద్ధమైంది.. వాట్సాప్ ద్వారా పౌరసేవలు అందించే అంశంపై కలెక్టర్ల సదస్సులో ప్రజెంటేషన్ ఇచ్చారు మంత్రి నారా లోకేష్..
గడచిన ఆరు నెలలుగా ప్రజల నుంచి 1,29,963 ఫిర్యాదులు ప్రభుత్వానికి వచ్చినట్టు తెలిపారు సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి సురేష్ కుమార్.. భోజన విరామం తర్వాత రాష్ట్రంలో ఫిర్యాదుల స్వీకరణపై కలెక్టర్ల సదస్సులో సమీక్ష నిర్వహించారు.. గ్రీవెన్స్ పరిష్కారంపై ప్రజెంటేషన్ ఇచ్చారు సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి సురేష్ కుమార్.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలకు ఇచ్చిన ఫిర్యాదులు అన్నింటినీ ఒక్కచోట నమోదు చేస్తున్నాం అన్నారు..