AP Cabinet Meeting: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రేపు ఏపీ కేబినెట్ సమావేశం కానుంది.. గురువారం రోజు ఉదయం 11 గంటలకు ఏపీ కేబినెట్ భేటీ కానుండగా.. మంత్రివర్గంలో కీలక అజెండాపై చర్చ సాగనున్నట్టుగా తెలుస్తోంది.. విశాఖలోని పంచగ్రామాల సమస్యకు ఇప్పటికే పరిష్కారం సూచించింది కూటమి ప్రభుత్వం.. పంచగ్రామాల భూములకు ప్రత్యమ్నాయంగా అదే విలువ కలిగిన భూములు కేటాయింపునకు నిర్ణయం తీసుకున్న విషయం విదితమే కాగా.. ఈ మేరకు కేబినెట్‌లో ఆమోదముద్ర పడే అవకాశం కనిపిస్తోంది.. ఇక, స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డ్ (SIPB)లో ఆమోదించిన 44 వేల 776 కోట్ల రూపాయల విలువ చేసే 15 ప్రాజెక్టులకు ఆమోదం తెలపనుంది మంత్రి మండలి.. ఈ ప్రాజెక్టుల ద్వారా 19,580 మందికి ఉద్యోగావకాశాల కల్పనే ధ్యేయంగా పెట్టుకుంది ప్రభుత్వం.. మరోవైపు.. ఈ నెల ఆఖరు వారంలో జరగనున్న ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలపై కేబినెట్ అనతరం సీఎం చంద్రబాబు.. మంత్రులతో ప్రత్యేకంగా చర్చించే అవకాశం ఉందంటున్నారు.. ఇక, రాష్ట్రంలో జరగనున్న రెండు గ్రాడ్యూయోట్, ఒక టీచర్ ఎమ్మెల్సీ స్ధానానికి జగనునున్న ఎన్నికల వ్యూహాలపై ఆయా జిల్లాల మంత్రుల, ఇంఛార్జ్ మంత్రులతో చర్చిoచే అవకాశం ఉంది.. ఉన్నత విద్యామండలికి ప్రత్యేక కమిషనరేట్ ఏర్పాటుపై కూడి కేబినెట్‌లో చర్చ జరగనుంది..
Read Also: W/O Anirvesh: చిత్ర బృందాన్ని అభినందించిన అల్లరి నరేష్.