మంత్రుల తీరుపై సీఎం రేవంత్‌రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల బాధ్యత అంతా ఇన్‌ఛార్జి మంత్రులదే అని స్పష్టం చేశారు. నిధులు, బాధ్యతలు అన్నీ మీ దగ్గరే ఉన్నాయని వెల్లడించారు. జిల్లాలపై ఇన్‌ఛార్జి మంత్రులు దృష్టిపెట్టడం లేదని.. ఇది కరెక్ట్ కాదన్నారు. నామినేటెడ్ పోస్టులు భర్తీ చేయండి అంటే ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. వెంటనే జిల్లాలో పదవులు భర్తీ చేయాలని సూచించారు. కార్యకర్తలను నారాజ్ చేయకండని పిలుపునిచ్చారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలంటూ మంత్రులకు టార్గెట్స్ ఇచ్చారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఈ నెల 27న ఏపీలో రెండు గ్రెడ్యుయేట్, ఒక టీచర్ ఎమ్మెల్సీ ఎన్నిక జరగబోతోంది.. ఈ ఎన్నికలకు సంబంధించి మంత్రులకు కీలక బాధ్యతలు అప్పగించారు చంద్రబాబు.. ఇంఛార్జ్ మంత్రులు.. కూటమి నేతలతో కలిసి సమావేశాలు నిర్వహించాలని ఆదేశాలు వెళ్లాయి.
పాలనపై మరింత ఫోకస్ పెడుతున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు. అయితే అదేసమయంలో.. పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయాలని భావిస్తున్నారు. కొందరు మంత్రుల తీరుపై ఇప్పటికే పలుదపాలుగా సీఎం చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఎమ్మెల్యేలతో సమన్వయం ఉండాలని ఇంచార్జి మంత్రులకు పదేపదే చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి కనిపించడం లేదు.
CM Revanth Reddy: నిజామాబాద్ జిల్లా పార్లమెంట్ అభ్యర్థులు, ఇన్చార్జ్ మంత్రులు, ఏఐసీసీ సెక్రెటరీలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూమ్ సమావేశం నిర్వహించారు.