ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి, అప్పులు, వడ్డీలపై 16వ ఆర్ధిక సంఘానికి వివరణ ఇచ్చారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. అమరావతి రాజధానిపై స్పెషల్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. రాష్ట్ర విభజన వల్ల వచ్చిన నష్టం.. కేంద్ర సాయంపై ప్రధానంగా సీఎం చంద్రబాబు వివరించారు... ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో ఏపీని ఆర్ధికంగా ఆదుకోవాల్సిన పరిస్థితిపై సీఎం చంద్రబాబు ప్రెజెంటేషన్ ఇచ్చారు.. గ్రామీణాభివృద్ధి.. పంచాయితీ రాజ్.. మున్సిపల్ శాఖలకు సంబంధించి కేంద్ర ఆర్థిక సంఘం నిధులు సిఫార్సు చేయాల్సిందిగా కోరారు…
Arvind Panagariya: నీతి ఆయోగ్ మాజీ వైస్ చైర్మన్ అరవింద్ పనగారియా 16వ ఆర్థిక సంఘానికి చైర్మన్‌గా నియమితులయ్యారు. రిత్విక్ రంజనం పాండే కమిషన్ కార్యదర్శిగా నియమితులయ్యారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదంతో పనగడియాయ ఫైనాన్స్ కమిషన్ చీఫ్‌గా నియమితులయ్యారు. ఈ ఆర్థిక సంఘం 2026 ఏప్రిల్ నుంచి ఐదేళ్ల కాలానికి సంబంధించి రూపొందించే నివేదికను అక్టోబర్ 31, 2025 నాటికి రాష్ట్రపతికి సమర్పించనుంది.