పొగాకు, మామిడి రైతులకు ప్రభుత్వం అండగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు సీఎం చంద్రబాబు. పంట ఉత్పత్తులను వాణిజ్య కోణంలోనే చూడాలని, వీలైనంత మెరుగైన ధర వచ్చేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మామిడి, పొగాకు, కోకో పంటల మద్ధతు ధరలపై ముఖ్యమంత్రి సమీక్ష చేశారు. ఈ ఏడాది హెచ్డీ బర్లీ పొగాకు 80 మిలియన్ కేజీల మేర ఉత్పత్తి వచ్చిందని ముఖ్యమంత్రికి వివరించారు అధికారులు.