Gayatri Mantra: గాయత్రీ మంత్రంతో ప్రధాని మోదీకి ఘన స్వాగతం.. వీడియో వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gayatri Mantra: భారత ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం (జూన్ 19) క్రొయేషియా రాజధాని జాగ్రెబ్ కు చేరుకున్న సందర్భంగా అక్కడ ఘన స్వాగతం లభించింది. బాల్కన్ దేశాలల్లోని క్రొయేషియాకు పర్యటించిన తొలి భారత ప్రధాని మోదీ కావడంతో ఈ పర్యటన ప్రత్యేకంగా మారనుంది. ప్రధాని మోదీ అక్కడ హోటల్‌కు చేరుకున్న వెంటనే అక్కడ ఉన్న భారతీయులు వందేమాతరం, భారత మాతకి జై.. అనే నినాదాలతో స్వాగతించారు. అంతేకాకుండా పెద్దేత్తున్న భారతీయ సాంస్కృతిక ప్రదర్శనలు కూడా నిర్వహించారు.
Also Read
- Abhishek Sharma: కాటేరమ్మ కొడుకా మజాకా.. బంతి వేయడమే ఆలస్యం కొట్టుడే కొట్టుడు.. చరిత్ర స్పష్టించిన అభిషేక్..
- Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
- IND Vs SL: మహిళల ఆసియా కప్ ఫైనల్.. శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడిన షఫాలీ వర్మ, స్మృతి మంధాన..
- IAF Report: ఆపరేషన్ సిందూర్‌పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
ఈ సందర్భంగా జరిగిన ఓ ప్రత్యేక ఘట్టం సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. తెల్ల దుస్తుల్లో ఉన్న కొందరు క్రొయేషియన్ పౌరులు గాయత్రీ మంత్రం, ఇతర సంస్కృత శ్లోకాలతో ప్రధాని మోదీకి ఆత్మీయ స్వాగతం పలికారు. భారతీయ సంస్కృతిని గౌరవించే ఈ ఘట్టం ఇప్పుడు చర్చనీయాంశంగా నిలిచింది. ఈ అరుదైన దృశ్యాన్ని మోదీ తన అధికారిక X అకౌంట్ ద్వారా పంచుకున్నారు. సంస్కృతికి ఉన్న బంధాలు బలంగా, ఉజ్వలమైనవిగా ఉన్నాయి.. జాగ్రెబ్‌లో ఈ స్వాగత ఘట్టం చూడడం సంతోషకరం. క్రొయేషియాలో భారతీయ సంస్కృతికి ఇంత గౌరవం ఉండటం ఎంతో గర్వకరం అంటూ మోదీ పేర్కొన్నారు.
ఆ తర్వాత ప్రధాని మోదీ మరో వీడియోను షేర్ చేస్తూ.. జాగ్రెబ్‌లో స్వాగతం మరపురానిది.. ప్రేమతో, ఆత్మీయతతో నిండిన స్వాగతం, కొన్ని ముఖ్యమైన క్షణాలు మీకోసం…” అని పేర్కొన్నారు. అనంతరం అక్కడి భారతీయ సభ్యులతో మోదీ ప్రత్యేకంగా ముఖాముఖి భేటీ అయ్యారు. జాగ్రెబ్‌లో ఉన్న కొంతమంది భారతీయులతో మాట్లాడే అవకాశం లభించింది. అక్కడ లభించిన ఆత్మీయ స్వాగతం మరువలేనిది. ఈ పర్యటన వల్ల రెండు దేశాల మధ్య సంబంధాలు మరింత బలపడతాయని వారికి విశ్వాసం ఉందని మోదీ అన్నారు.
The bonds of culture are strong and vibrant! Here is a part of the welcome in Zagreb. Happy to see Indian culture has so much respect in Croatia… pic.twitter.com/G749A952wP
— Narendra Modi (@narendramodi) June 18, 2025
ఈ పర్యటనలో మరో విశేషం ఏమిటంటే.. క్రొయేషియా ప్రధాని ఆండ్రేజ్ ప్లెంకోవిక్ స్వయంగా ఎయిర్‌పోర్ట్‌కి వచ్చి ప్రధాని మోదీకి స్వాగతం పలికారు. కెనడాలో జరిగిన G7 సమ్మిట్‌లో పాల్గొన్న అనంతరం మోదీ జాగ్రెబ్‌కి చేరుకున్నారు. ఆయన ఇటలీ, కెనడా తర్వాత సైప్రస్‌కి కూడా పర్యటన ఇచ్చారు. ఈ పర్యటనలో భాగంగా క్రొయేషియా చేరుకున్నారు.
A welcome to remember in Zagreb, full of warmth and affection! Here are the highlights… pic.twitter.com/PVSdiVAekO
— Narendra Modi (@narendramodi) June 18, 2025
తాజావార్తలు
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకా మజాకా.. బంతి వేయడమే ఆలస్యం కొట్టుడే కొట్టుడు.. చరిత్ర స్పష్టించిన అభిషేక్..
-
Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
-
IND Vs SL: మహిళల ఆసియా కప్ ఫైనల్.. శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడిన షఫాలీ వర్మ, స్మృతి మంధాన..
-
IAF Report: ఆపరేషన్ సిందూర్‌పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
-
Prithviraj Sukumaran: ‘వారణాసి’ చేస్తూనే 9 సినిమాలు.. మాలీవుడ్ స్టార్ స్పీడ్ చూసి జక్కన్న షాక్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!