పౌరసరఫరాల శాఖ ద్వారా ధాన్యం కొనుగోలు ప్రక్రియపై సమీక్ష నిర్వహించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 26 జిల్లాల కలెక్టర్లు, సివిల్ సప్లై శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు.. ఈ సమీక్షకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్, మంత్రులు నాదెండ్ల మనోహర్, అచ్చెన్నాయుడు కూడా హాజరయ్యారు..
వరద బాధిత కుటుంబాలకు శుక్రవారం నిత్యావసర వస్తువుల పంపిణీ ప్రారంభించనుంది ఏపీ పౌరసరఫరాల శాఖ.. సుమారు 2 లక్షల మంది లబ్ధిదారులకు ఈ పంపిణీ జరగనుంది.. 179 వార్డు,3 గ్రామ సచివాలయాల పరిధిలో పంపిణీ చేపట్టనున్నారు.. ముంపు బాధితులు అందరికీ నిత్యావసర వస్తువులు అందిస్తామని వెల్లడించారు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్...