CM Revanth Reddy: ఈనెల 9న తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు మాజీ సీఎం కేసీఆర్ రావాలని.. సూచనలు, సలహాలు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. అనంతరం సీఎం మాట్లాడుతూ… ప్రభుత్వం అంటే 64 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కాదని, 119 మంది ఎమ్మెల్యేలు కలిస్తేనే ప్రభుత్వం అని అన్నారు. ప్రతిపక్ష నాయకుడిగా కుర్చీ ఖాళీగా ఉండటం రాష్ట్రానికి మంచిదా? అని ప్రశ్నించారు. మీ చతురత చూపించి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టండి అన్నారు. కేసీఆర్ కంటే ఒకరిద్దరే సీనియర్లు.. మేమంతా అప్ కమింగ్ ప్రతినిధులమని తెలిపారు. మాకు భేషజాలు లేవు.జ మీ సలహాలు ఇవ్వాలని కోరారు.
Read also: Vikrant Massey : మాట తప్పాడు.. మడమ తిప్పాడు..
కుటుంబ పెద్దగా మీ కుటుంబ సభ్యులకు చెప్పండి.. మీ పిల్లలు తప్పు చేసినట్టు అయితే వారికి సర్ది చెప్పాలన్నారు. మీ పిల్లలిద్దర్ని మాపై ఉసి గొల్పుతున్నారు.. వారిని అలా వదిలేయకండి అన్నారు. మేము మిమ్మల్ని అవమానించి, అనుమానించింది లేదన్నారు. కేసీఆర్ మీ పెద్దరికాన్ని నిలబెట్టుకోవాలన్నారు. మీ పిల్లలు తుల్వపనులు చేస్తున్నారని సీఎం రేవంత్ తెలిపారు. డిసెంబరు 9న తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంకు కేసీఆర్ ను ఆహ్వానించేందుకు మంత్రి పొన్నం వస్తారన్నారు. తమిళనాడు స్ఫూర్తి మనకు ఎందుకు లోపించిందని తెలిపారు. మీరు ఇష్టపడ్డా లేకున్నా ప్రజలు ఇచ్చిన తీర్పు ఇదన్నారు. నిజాం ప్రభువుకే రాజ్యాన్ని వదిలి వెళ్లడం తప్పలేదన్నారు. మేము అధికారంలో ఉన్నది ఐదు నెలలే అన్నారు.
పెళ్ళైన కొత్త అల్లుడు ఆషాడ మాసం సందర్భంగా అత్తగారి ఇంటికి వెళ్లలేడన్నారు. హరీష్ రావు, కేటీఆర్ కు చిన్న పిల్లల మనస్తత్వం.. శాడిస్టిక్ మెంటలిటి వాళ్ళదని సీఎం అన్నారు. కేసీఆర్ మీ పిల్లలకు తప్పు ఒప్పులు చెప్పాలన్నారు. యటమటం చేస్తే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు.. రాజ్యాంగం ప్రకారం ముందుకు వెళతామన్నారు. మా ఒత్తిడి మేరకే సెక్రటేరియట్ కు అంబేద్కర్ పేరు పెట్టారన్నారు. మమ్మల్ని ఆ కుర్చీల్లో చూడటం కేసీఆర్ కు ఇష్టం లేకపోతే ఎలా? అని ప్రశ్నించారు. మీరు చేసిన తప్పులను సరి చేసుకుంటూ.. అప్పులను కట్టుకుంటూ పరిపాలన కొనసాగిస్తున్నాం.ప్రతి మండలంలో ఓ ఇందిరమ్మ మోడల్ హౌజ్ నిర్మాణం చేస్తున్నామన్నారు.
Read also: Ponguleti Srinivasa Reddy: ఇందిరమ్మ ఇండ్ల కోసం ఎవరు ఒక్క పైసా ఇవ్వొద్దు..
ప్రజా ఉత్సవాలకు కేసీఆర్, కిషన్ రెడ్డి, బండి సంజయ్ హాజరు కావాలని కోరారు. మంత్రి పొన్నం ప్రభాకర్ వారిని ప్రత్యేకంగా ఆహ్వానిస్తారన్నారు. ఈనెల 7, 8, 9 తేదీల్లో నెక్లెస్ రోడ్ లో ఉత్సవాలు, కార్నివాల్, తెలంగాణ పిండి వంటలు ఉంటాయన్నారు. ఇతర రాష్ట్రాలు, దేశాల వారు కూడా ఈ పండుగకు రావొచ్చని ఆహ్వానించారు. పది సంవత్సరాలు కేసీఆర్ అధికారంలో ఉన్నారని గుర్తుచేశారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు 25 లక్షల 4 వేల ఇండ్లు 2004 నుంచి 2014 వరకు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చామన్నారు. పేదలకు ఒక లక్ష 50 వేలు ఇస్తామని కేసీఆర్ హామీ ఇచ్చి మరిచారన్నారు. వారు అర్దాంతరంగా వదిలేసిన ఇండ్లకు నిధులు మేము కేటాయించామని సీఎం రేవంత్ తెలిపారు. మీకు కావాల్సిన భవనాలు, భవంతులు పదేళ్ళలో నిర్మించుకున్నారని అన్నారు.
Read also: Top Headlines @ 1 PM: టాప్ న్యూస్
పార్టీ కార్యాలయాలు, ఫామ్ హౌజ్ లు నిర్మించుకున్న శ్రద్ద.. పేదల ఇండ్ల నిర్మాణంపై లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ ఎన్నికల సమయంలో ఇందిరమ్మ ఇండ్లు డబ్బా ఇండ్లని అద్భుతమైన ప్రసంగాలు చేసి.. పేదల ఇండ్ల కోసం కాకుండా బెల్టు షాపులకు దారి చూపించాడని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. ష్ట్రాన్ని అధోగతి పాలు చేశారని మండిపడ్డారు. 60 సంవత్సరాలు కాంగ్రెస్ పరిపాలించి.. 16 వేల కోట్ల మిగులు బడ్జెట్ తో కేసీఆర్ కు అప్పగించారన్నారు. కానీ పది సంవత్సరాల్లో రూ.7 లక్షల కోట్ల అప్పులు చేసి మాకు అప్పగించారని సీఎం అన్నారు. కేసీఆర్.. లక్షల ఎకరాల భూములను అమ్ముకున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు. లక్షల ఎకరాలు బలవంతంగా ప్రజల నుంచి గుంజుకున్నారని అన్నారు. రాష్టాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టారని మండిపడ్డారు రేవంత్ రెడ్డి. జరిగిన తప్పిదాలను సరిదిద్దుకుంటున్నామన్నారు.
Read also: Pushpa 2 : రాజమౌళి మాటలను నిజం చేసిన చూపించిన సుకుమార్
చంద్రబాబు, వైఎస్ హయాంలో ప్రభుత్వాలకు సూచనలు చేశారు. మంచి సంప్రదాయం ఉండేదన్నారు. 2008 ఉప ఎన్నికల్లో వైఎస్ రాజశేఖరరెడ్డిని హరీష్ రావు కలిశారు. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసి పడుతున్న సమయంలో హరీష్, వైఎస్ ను కలిశారు. దాన్ని నేను తప్పు పడతలేను అని సీఎం అన్నారు. తర్వాత ఆయన నియోజకవర్గ అభివృద్ధి కోసం కలిశానని హరీష్ తెలిపారు. నిధుల కోసం ప్రతిపక్షాల ఎమ్మెల్యేలు ప్రభుత్వ పెద్దలను కలిసే సంప్రదాయం ఉండేదని సీఎం గుర్తుచేశారు. అధికార, ప్రతిపక్షాలు అంటే శత్రువులు అనే విధంగా కేసీఆర్ తయారు చేశారన్నారు. మానసిక పరిపక్వత కేసీఆర్ లో రావాలన్నారు. రాష్ట్రం అభివృద్ధి జరగడం ఇష్టం లేదా కేసీఆర్…? అని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.
Pushpa 2 : రాజమౌళి మాటలను నిజం చేసిన చూపించిన సుకుమార్