పంచగ్రామాల ప్రజలకు శుభవార్త చెప్పారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఈ విషయాన్ని మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు వెల్లడించారు.. పంచగ్రామాల ప్రజలకు సీఎం గుడ్‌న్యూస్ చెప్పారు.. త్వరలోనే సింహాచలంలో సమావేశాన్ని ఏర్పాటు చేసి పట్టాలు పంపిణీ చేస్తాం అన్నారు.. పంచ గ్రామల సమస్య ఉన్న నాలుగు నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, అధికారులుతో పంచగ్రామాల సమస్యలపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. కోర్టులలో ఉన్న వివాదాలను విత్ డ్రా చేసుకునేందుకు ఇరుపక్షాలు అంగీకారం తెలిపాయన్నారు…