CM Chandrababu Serious: ఎవరు కూడా వన్ టైం ఎమ్మెల్యేలుగా మిగిలిపోవద్దని సీఎం చంద్రబాబు పదే పదే చెబుతున్నారు .. ఈ మధ్యకాలంలో ఏ సందర్భం దొరికిన ఎమ్మెల్యేలు పనితీరు గురించే సీఎం చంద్రబాబు పర్రస్తావిస్తున్నారు. కొంతమంది ఎమ్మెల్యేల పనితీరు ఇబ్బందికరంగా ఉందంటూ… ఇప్పటికే చాలాసార్లు సీఎం చంద్రబాబు హెచ్చరించారు.. చాలా మీటింగుల్లో చెప్పారు.. కానీ, ఎంత చెప్పినా కొంతమంది ఎమ్మెల్యేల పనితీరులో ఏమాత్రం మార్పు రావట్లేదు. తాజాగా ముగ్గురు ఎమ్మెల్యేల విషయంలో సీఎం చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు… ఆముదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ ను హెచ్చరించారు సీఎం చంద్రబాబు. కొన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలన్నారు. లేటెస్టుగా కూన రవికుమార్ తీరుపై ఓ మహిళ ప్రిన్సిపాల్ ఆందోళన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే వేధింపులు ఎక్కువయ్యాయని తనను అనవసరంగా వేధిస్తున్నారని కన్నీటి పర్యంతం అయ్యారు.. దీనిపై కూన రవికుమార్ క్లారిటీ ఇచ్చారు.. విద్యార్థినుల అడ్మిషన్లకు అక్రమంగా డబ్బులు వసూలు చేయడం, వారికి ఉపయోగించాల్సిన నిత్యావసరాలను దారి మళ్లించడం వంటి అంశాలను ప్రశ్నించినందుకు, ప్రిన్సిపల్ వైసీపీ నేతలతో కలిసి తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు కూన.. తల్లికి వందనం కార్యక్రమంపై ముగ్గురు ప్రిన్సిపల్స్‌తో ఒకేసారి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా, కేవలం పొందూరు కేజీబీవీ ప్రిన్సిపల్‌తోనే వీడియో కాల్ తీసుకున్నట్లు అబద్ధపు ఆరోపణలు చేస్తున్నారన్నారు.
Read Also: MEGA 157 : మెగాస్టార్ సినిమా టైటిల్ చెప్పేసిన అనిల్ రావిపూడి.. అదిరిందిగా
ఇక, జూనియర్ ఎన్టీఆర్ పై అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి కూడా సీఎం చంద్రబాబు రియాక్ట్ అయ్యారు.. ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు మంచిది కాదన్నారు..చంద్రబాబు.. జనంలో ఈ రకమైన వ్యాఖ్యలు.. తప్పుడు సంకేతాలు వెళ్లే విధంగా ఉంటాయన్నారు… ఇక గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నజీర్ వ్యవహారంపై కూడా సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు… వీడియో కాల్స్ అసభ్య పదజాలం.. అసభ్యకరమైన వీడియోలు ఉంటే .. ఆ ఎమ్మెల్యేల మీద జనంలో చులకన భావం కలిగిస్తుందని ఇలాంటి విషయాలపై చాలా జాగ్రత్తగా ఉండాలని సీఎం స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్టు తెలిసింది … మొన్న ఆగస్టు 15న కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డి కుర్చీ విషయంలో అధికారి మీద సీరియస్ అయిన పరిస్థితి.. ఇలాగే ప్రతి జిల్లాలో కొంతమంది ఎమ్మెల్యే ల వ్యవహార శైలి.. సీఎంకు ఇబ్బంది కలిగిస్తోంది.. ఎమ్మెల్యేల వ్యవహరి శైలి పై ఇప్పటికే చాలా సందర్భాల్లో హెచ్చరించారు చంద్రబాబు…