మంగళగిరి ఎయిమ్స్‌కు శుభవార్త చెప్పారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో కలిసి మంగళగిరి ఎయిమ్స్ మొదటి స్నాతకోత్సవంలో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎయిమ్స్ మంగళగిరికి 10 ఎకరాల భూమి ఇస్తామని తెలిపారు.. దేశంలో ఏ AIIMS కు కూడా ఇలాంటి భూమి లేదు.. అమరావతి భారతదేశపు భవిష్యత్ సిటీ.. మంగళగిరి ఎయిమ్స్ భారతదేశంలోనే నంబర్ 1 అవుతుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు..
ప్రతీ రోగికీ సేవలందించాలని, ప్రతీ డాక్టర్ సేవకే ప్రాధాన్యత ఇవ్వాలని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అన్నారు. యువ డాక్టర్లు సేవ చేయడానికే ప్రాధాన్యత ఇవ్వాలని తాను కోరుతున్నా అని.. ఆరోగ్యకరమైన, అభివృద్ధి సాధించే భారతదేశం మనందరికీ కావాలన్నారు. దేశ ప్రజలందరూ ఆరోగ్యవంతులుగా ఉండాలని, పూర్తి ఆరోగ్యంపై అందరూ దృష్టి పెట్టాలన్నారు. సమయం, పరిస్ధితులను బట్టి ప్రతీ మనిషి జీవనశైలి ఉండాలని రాష్ట్రపతి సూచించారు. మంగళగిరి ఎయిమ్స్ మొదటి స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.…
Draupadi Murmu: మంగళగిరి ఎయిమ్స్ మొదటి స్నాతకోత్సవం ఈరోజు (డిసెంబర్ 17) జరగనుంది. దీనికి భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ముఖ్య అతిథిగా హాజరుకాబోతున్నారు. ఈ నేపథ్యంలో మంగళగిరి ఎయిమ్స్‌లో కట్టుదిట్టమైన భద్రతను అధికారులు ఏర్పాటు చేశారు.
మంగళగిరి ఎయిమ్స్‌ను పేదల కోసం ఉపయోగపడేలా ప్రధాని మోడీ ఏర్పాటు చేశారని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. తెలుసుకోవాలని లేనివాళ్ళు ఎప్పటికీ తెలుసుకోలేరు... మోదీ ప్రభుత్వం చేసిన మార్పులను అని ఆయన వ్యాఖ్యానించారు.
రాష్ట్ర విభజన చట్టంలో భాగంగా ఏపీకి కేటాయించిన ఎయిమ్స్ ప్రారంభానికి సిద్ధమైంది. ఈ ఆధునిక వైద్య దేవాలయాన్ని రేపు ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. మంగళగిరి ఎయిమ్స్‌ను ప్రధాని మోడీ జాతికి అంకితం చేయనున్నారు. అలాగే 9 క్రిటికల్ కేర్ యూనిట్లకు ప్రధాని మోడీ శంకుస్థాపన చేయనున్నారు.
ఏపీ పర్యటనలో భాగంగా ఇవాళ పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు కేంద్ర మంత్రి భారతీ పవార్. మంగళగిరిలో ఏర్పాటుచేసిన ఎయిమ్సును సందర్శించిన కేంద్ర మంత్రి భారతీ పవార్.. అక్కడ అందుతోన్న సేవలపై రోగుల నుంచి ఆరా తీశారు. మందులు అందుతున్నాయా..? లేదా అంటూ రోగుల బంధువులను అడిగి తెలుసుకున్నారు కేంద్ర మంత్రి పవార్. జనరిక్ మెడిసిన్ అందుబాటులో ఉన్నాయా..? లేవా..? అంటూ ఆరా తీశారు. ఆయుష్మాన్ భారత్ పథకం అమలు గురించి కేంద్ర మంత్రి అడిగారు. అయితే, ఆయుష్మాన్…