జూలియన్ వెబర్ పై ప్రతీకారం తీర్చుకున్న నీరజ్ చోప్రా.. పారిస్ డైమండ్ లీగ్ లో విజయం పారిస్ డైమండ్ లీగ్ 2025 పురుషుల జావెలిన్ త్రో ఈవెంట్‌లో భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా మొదటి స్థానాన్ని గెలుచుకున్నాడు. జూన్ 20న (శుక్రవారం) పారిస్‌లో జరిగిన ఈ ఈవెంట్‌లో నీరజ్ తన సమీప ప్రత్యర్థి జర్మనీకి చెందిన జూలియన్ వెబర్‌ను ఓడించాడు. గత రెండు టోర్నమెంట్లలో నీరజ్ వెబర్ చేతిలో ఓడిపోయాడు, కానీ ఇప్పుడు ఆ…
Narendra Modi : విశాఖపట్నం సాక్షిగా అంతర్జాతీయ యోగా దినోత్సవం ఘనంగా ప్రారంభమైంది. సముద్రతీరాన లక్షలాది మంది ప్రజలు చేరి యోగాసనాలు చేస్తూ ఈ వేడుకను ఆహ్లాదంగా జరుపుకుంటున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో పాటు కేంద్ర, రాష్ట్ర మంత్రులు, అనేక మంది ప్రముఖులు ఈ విశిష్ట కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ.. యోగా ప్రపంచాన్ని ఏకం చేసిందన్నారు. 175 దేశాలు…
CM Chandrababu : విశాఖ నగరం ఈ ఉదయం అద్భుత దృశ్యానికి వేదికైంది. అర్బన్ సముద్రతీరాన ఆర్కే బీచ్ వద్ద 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సైతం ఈ యోగ దినోత్సవం కార్యక్రమంలో పాల్గొనడం విశేషం. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన యోగాసనాల ప్రదర్శన 45 నిమిషాలపాటు సాగనుంది. దేశ నలుమూలల నుంచి వచ్చిన ప్రజలతోపాటు స్థానికులు వేలాది సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా…
నేడు విశాఖలో యోగాంధ్ర వేడుకలు. RK బీచ్‌లో యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొనున్న మోడీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో పాటు మంత్రులు, ప్రముఖులు. ఉదయం 7 గంటలకు ప్రారంభం కానున్న యోగాంధ్ర వేడుకలు. నేడు ప్రపంచ యోగా దినోత్సవం. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో యోగా డే వేడుకలు. నేడు తెలంగాణలో ఘనంగా యోగా డే వేడుకలు. హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో యోగా డే వేడుకలు. పాల్గొననున్న సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ప్రముఖులు. మహబూబ్ నగర్…
మూడు రాష్ట్రాల్లో ప్రధాని మోడీ రెండు రోజుల పర్యటన జరగనుంది. జూన్ 20–21 తేదీల్లో బీహార్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ప్రధాని మోడీ పర్యటించనున్నారు. బీహార్‌లోని సివాన్ జిల్లాలో రేపు మధ్యాహ్నం 12 గంటలకు రూ. 400 కోట్ల విలువైన వైశాలీ–దియోరియా రైలు మార్గం ప్రారంభిస్తారు.
1,29,249 ప్రాంతాల్లో ఏపీలో యోగా చేయబోతున్నారు.. దేశమంతా 8 లక్షల ప్రాంతాల్లో యోగా చేయబోతున్నారు.. ఇది చరిత్రలో జరగలేదు అన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని.. విశాఖతో పాటు రాష్ట్రవ్యాప్తంగా జరిగే యోగా కార్యక్రమం, ఏర్పాట్లపై ఆయన మీడియాతో మాట్లాడుతూ.. యోగ పై ప్రజల్లో ఇంట్రెస్ట్ వచ్చింది.. 1 కోటి 5 లక్షల 58 వేలకు పైగా అంతర్జాతీయ యోగా డే కోసం రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు.. ఇండియా మొత్తంలో 8 లక్షల…
రికార్డులు సృష్టించేందుకు విశాఖ సన్నద్ధమైంది. యోగాంధ్ర 2025 సన్నాహాలు తుది దశకు చేరుకున్నాయి. గిన్నీస్ బుక్ సహా 22 రికార్డుల్లో నమోదు అయ్యేలా ఏపీ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది. ఆర్కే బీచ్ నుంచి భీమిలి వరకు యోగాభ్యాసంలో 3.5 లక్షల మంది పాల్గొననున్నారు. మొత్తం 5 లక్షల మందితో ఇంటర్నేషనల్ యోగా డే జరగనుంది. ప్రధానమంత్రి మోడీ సమక్షంలో విశాఖ యోగా డే డిక్లరేషన్ ఏపీ ప్రభుత్వం ప్రకటించనుంది. మరోవైపు నగరంలో ఉత్సాహభరిత వాతావరణం కనిపిస్తోంది.…
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విశాఖపట్నంలోని ఆర్కే బీచ్ ఏరియా తాత్కాలిక రెడ్ జోన్ పరిధిలోకి వచ్చింది. నేటి నుంచి 96 గంటల పాటు ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. నావల్ కోస్ట్ బ్యాటరీ నుంచి పార్క్ హోటల్ జంక్షన్ వరకు ఆంక్షలు కొనసాగుతాయని వైజాగ్ సిటీ పోలీసు కమిషనర్ తెలిపారు. 5 కిలో మీటర్ల పరిధిలో ప్రైవేట్ డ్రోన్‌లను ఎగురవేయడం, నిరసనలు, ర్యాలీలు చేపట్టడం లాంటి కార్యక్రమాలను నిషేధిస్తున్నట్లు చెప్పారు. ఎవరైనా ఆదేశాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు…
విశాఖ వేదికగా యోగాంధ్ర-2025ను విజయవంతం చేసేందుకు ఏపీ ప్రభుత్వం విస్తృతమైన ఏర్పాట్లు చేస్తోంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, గవర్నర్ అబ్దుల్ నజీర్ వంటి ప్రముఖులు అంతర్జాతీయ యోగాడేలో పాల్గొనున్నారు. ప్రధాన వేదికగా ఆర్కే బీచ్ ఎంపిక చేశారు. వర్షాలు లేదా భద్రత కారణాల వల్ల మార్పు చేయాల్సి వస్తే.. ఆంధ్రా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్ సిద్ధం అయింది. 3.5 లక్షల నుంచి ఐదు లక్షల మంది…
విశాఖపట్నం వేదికగా ‘విశ్వమంతా యోగాతో ఆరోగ్యం’ నినాదంతో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని అత్యంత భారీగా నిర్వహించేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసింది. యోగాంధ్ర 2025కు విస్తృత ప్రచారం కల్పించడం, భారీ సంఖ్యలో ప్రజలను భాగస్వాములు చేసేందుకు నెల రోజుల కార్యాచరణ ప్రభుత్వం రూపొందించింది. ఇందులో భాగంగా ఈరోజు బాపట్ల పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ లో యోగాంధ్ర క్యాంపెయిన్ నిర్వహించారు. ఈ క్యాంపెయిన్లో మంత్రులు కొలుసు పార్థసారథి, గొట్టిపాటి రవికుమార్, బాపట్ల ఎంపీ కృష్ణప్రసాద్,…