CM Chandrababu: కూటమి ఓటు బ్యాంకు పెరిగింది.. వైసీపీకి తగ్గింది.. ఈవీఎం, బ్యాలెట్ ఏదైనా కూటమిదే విజయం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu: స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు కూటమికి అద్భుతమైన తీర్పు ఇచ్చారని టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనకు ప్రజలు ఇచ్చిన గుర్తింపుగా ఈ ఫలితాలను అభివర్ణించారు. అర్బన్, రూరల్ ఓటర్లతో పాటు పోస్టల్ బ్యాలెట్‌లోనూ కూటమికి మంచి మద్దతు లభించిందని తెలిపారు. మున్సిపల్, పరిషత్ ఎన్నికల్లో అన్ని స్థాయిల్లోనూ కూటమి మంచి ఫలితాలు సాధించిందన్నారు. జెడ్పీటీసీ ఎన్నికల్లో 96.42 శాతం, ఎంపీపీ ఎన్నికల్లో 93.15 శాతం, మున్సిపల్ ఎన్నికల్లో 94 శాతం స్ట్రైక్ రేట్ సాధించామని చంద్రబాబు వెల్లడించారు. కూటమి ఓటు బ్యాంకు 3.6 శాతం పెరిగిందని, వైసీపీ ఓటు బ్యాంకు 6.25 శాతం తగ్గిందని పేర్కొన్నారు. రెండేళ్ల కూటమి పాలనకు ఈ ఫలితాలే నిదర్శనమని అన్నారు.
కూటమిలో సమన్వయం, క్రమశిక్షణకు ప్రాధాన్యం
కూటమి ఐక్యత కొనసాగాలంటే నాయకులు, కార్యకర్తలు క్రమశిక్షణతో పనిచేయాలని చంద్రబాబు సూచించారు. జిల్లా నాయకులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌ఛార్జులు పరస్పరం సంప్రదింపులు జరిపి అభ్యర్థుల ఎంపికపై నిర్ణయాలు తీసుకున్నామని చెప్పారు. ఇందుకోసం కోఆర్డినేషన్ కమిటీలు ఏర్పాటు చేశామని, ఎన్నికల సమయంలో రియల్ టైమ్‌లో సమన్వయం చేసుకున్నామని వివరించారు. మిత్రపక్షాలతోనూ ఇదే స్థాయిలో సమన్వయం కొనసాగించామని తెలిపారు. అభ్యర్థుల ఎంపికలో పార్టీకి చేసిన సేవలు, సీనియారిటీ, అనుభవం వంటి అంశాలకు ప్రాధాన్యం ఇచ్చామని చెప్పారు. టీడీపీ నాయకత్వ ఎంపికకు ప్రత్యేక విధానాన్ని రూపొందించామని వెల్లడించారు. అభ్యర్థుల విద్యార్హతలు, వ్యక్తిగత ప్రవర్తన, పార్టీతో అనుబంధం, అంకితభావం, వయసు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకున్నామని తెలిపారు. విద్యతో పాటు వ్యక్తిత్వం, నైతిక విలువలు కూడా ఉండాలని, పార్టీ భవిష్యత్తు కోసం కొత్త నాయకత్వాన్ని తయారు చేయడమే లక్ష్యమని పేర్కొన్నారు.
Also Read
- Andhra Pradesh Rice Prices: బియ్యం ధరలకు కళ్లెం.. కిలో రూ.47 నుంచి రూ.82! ఏపీ సర్కార్ కీలక ఆదేశాలు
- APMDC: ఏపీలో మైనింగ్ రంగానికి భారీ ప్రణాళికలు.. ఏపీఎండీసీ ఐపీవోకు సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్!
- Tamil Nadu vs AP: తమిళనాడు రహస్యాలు ఏపీకి లీక్? విజయ్ సర్కార్ సంచలన నిర్ణయం.. 15 మంది ఉద్యోగులపై వేటు!
- AP MPP Election Results: ఎంపీపీ ఎన్నికల్లో పార్టీల బలమెంత? అధ్యక్ష, ఉపాధ్యక్ష స్థానాల పూర్తి లెక్కలివే!
క్షేత్రస్థాయి నుంచి అభ్యర్థుల ఎంపిక
అభ్యర్థుల ఎంపికలో క్షేత్రస్థాయి కమిటీల సిఫార్సులకు ప్రాధాన్యం ఇచ్చామని చంద్రబాబు వివరించారు. బూత్ కమిటీల నుంచి జిల్లా స్థాయి వరకు అభిప్రాయాలు సేకరించామని చెప్పారు. కుటుంబ సాధికార సభ్యుల సిఫార్సులతో పాటు పంచాయతీ, యూనిట్, క్లస్టర్, మండల కమిటీల అభిప్రాయాలను పరిశీలించామని తెలిపారు. ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌ఛార్జులు, సీనియర్ నాయకులతో సంప్రదింపులు జరిపినట్లు వెల్లడించారు. 175 నియోజకవర్గాలకు ప్రత్యేక పరిశీలకులను నియమించామని, జిల్లా స్థాయిలో నలుగురు సభ్యులతో సమన్వయ కమిటీలను ఏర్పాటు చేశామని చెప్పారు. కూటమి భాగస్వామ్య పార్టీలతోనూ చర్చలు జరిపి అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను పూర్తి చేశామన్నారు.
డిజిటల్ విధానంలో అభ్యర్థుల ఎంపిక
అభ్యర్థుల ఎంపికలో డిజిటల్ విధానాన్ని కూడా ఉపయోగించామని చంద్రబాబు తెలిపారు. గత ఎన్నికల డేటా ఆధారంగా అభ్యర్థుల ప్రొఫైల్స్ రూపొందించామని, ‘మై టీడీపీ’ యాప్ ద్వారా సేకరించిన వివరాలను పరిశీలించామని చెప్పారు. పార్టీ కార్యక్రమాల్లో నాయకుల పనితీరును విశ్లేషించి, పార్టీకి చేసిన సేవల ఆధారంగా రేటింగ్ ఇచ్చామన్నారు. అభ్యర్థులకు ప్రజల్లో ఉన్న ఆదరణ తెలుసుకునేందుకు ఐవీఆర్ఎస్ సర్వే నిర్వహించామని వెల్లడించారు. మొత్తం ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షించేందుకు ప్రత్యేక వార్‌రూమ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇక, కార్యకర్తలే తెలుగుదేశం పార్టీకి మూలస్తంభాలని పేర్కొన్నారు. పార్టీ లేకపోతే నాయకులు ఉండరని, కార్యకర్తలు లేకపోతే పార్టీ ఉండదని వ్యాఖ్యానించారు. నాయకులు, కార్యకర్తల మధ్య అనుసంధానానికి ఎప్పుడూ ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు. నిరంతరం కొత్త నాయకత్వాన్ని తయారు చేసే ప్రక్రియ కొనసాగుతుందని, కార్యకర్తల సంక్షేమం, పార్టీ అభివృద్ధి తమకు ముఖ్యమని తెలిపారు. ‘జై కార్యకర్త’ అనే నినాదంతో ముందుకు సాగుతున్నామని పేర్కొన్నారు.
40 ఏళ్లుగా టీడీపీకి బీసీలే కంచుకోట
గత 40 ఏళ్లుగా బీసీలే తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా నిలిచారని చంద్రబాబు అన్నారు. పార్టీని నిలబెట్టింది, కాపాడింది బీసీలేనని పేర్కొన్నారు. బీసీలకు అగ్రస్థానం కల్పించాలన్నదే తమ ఆలోచన అని స్పష్టం చేశారు. బీసీ రిజర్వేషన్ల కోసం సుప్రీంకోర్టు వరకు పోరాటం చేశామని గుర్తుచేశారు. అర్హతలకు అనుగుణంగా బీసీలకు రిజర్వేషన్లు కల్పించేందుకు చర్యలు తీసుకున్నామని తెలిపారు టీడీపీ అధినేత, సీఎం నారా చంద్రబాబు నాయుడు..
తాజావార్తలు
-
Nasha Mukt Bharat: డ్రగ్స్‌పై పోరుకు విక్టరీ వెంకటేష్ మద్దతు.. హైదరాబాద్‌లో నషా ముక్త్ భారత్ యాత్ర..
-
CM Chandrababu: కూటమి ఓటు బ్యాంకు పెరిగింది.. వైసీపీకి తగ్గింది.. ఈవీఎం, బ్యాలెట్ ఏదైనా కూటమిదే విజయం.
-
Parliament Session December 2026: డిసెంబర్ 10 నుంచి పార్లమెంట్ సమావేశాలు..!?.. కీలక బిల్లుపై ఉత్కంఠ
-
Ambati Rayudu: హైదరాబాద్ ఆటగాళ్లకు ఎప్పుడూ అన్యాయమేనా..? ముంబై ఆటగాళ్లపై సంచలన వ్యాఖ్యలు..!
-
Ambati Rayudu: పని చేయాలంటే కోహ్లీలా.. పని చేయించాలంటే ధోనీలా ఉండాలి.!
ట్రెండింగ్
-
Couple Attacked: పార్కులో ఫొటోలు దిగుతున్న జంటపై కర్రలతో దాడి.. అదుపులోకి 8 మంది మైనర్లు..!
-
Viral Video: ఛీ.. ఛీ.. వ్యూస్ కోసం ఇంతకు దిగజారాలా..? బస్సులో ప్రయాణికుడితో యువతి వికృత చేష్టలు..!
-
అబ్బా ఏముంది మామ కారు.. 1,100 కి.మీ. రేంజ్, లెవల్-2 ADAS తో రానున్న JSW Combat..!
-
IND vs NZ: ముగిసిన మూడోరోజు ఆట.. 118 పరుగుల ఆధిక్యంలో భారత్.!
-
Royal Enfield బైక్ లవర్స్‌కు క్రేజీ న్యూస్.. 10 ఏళ్ల వారంటీ.. ఎక్స్ట్రా ఖర్చు లేకుండానే..!